నేడు, రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం నేడు వాయవ్య బంగాళాఖాతం, పశ్చిమ బంగాల్, ఒడిశా ప్రాంతంలో కొనసాగుతుందని వెల్లడించారు. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపోస్ఫియార్ స్థాయి వరకు ఉపరితల ఆవర్తనము వ్యాపించిందని పేర్కొన్నారు.
Weather: ఆ జిల్లాల్లో.. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం - hyderbad latest news'
శుక్రవారం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. నేడు, రేపు ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం
రాగల 2 నుంచి 3 రోజుల్లో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందన్నారు. శనివారం ఉత్తర, పశ్చిమ ద్రోణి ,అల్పపీడన ప్రాంతం నుంచి... మహారాష్ట్ర మీదుగా అరేబియా సముద్రం వరకు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిందని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:Third wave: 'కరోనా మూడో దశ అనివార్యం'