Weather Report Of Telangana: కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు రాగల మూడు నాలుగు రోజుల్లో పలు ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలు, కేరళలోని మిగిలిన భాగాలకు తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు దక్షిణ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలకు ముందుకు సాగేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని వాతావరణ కేంద్రం వివరించింది.
Weather Report Of Telangana: రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు - Telangana Rains
Weather Report Of Telangana: నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
rain
ఉపరితల ద్రోణి ఆగ్నేయ అరేబియా తీరంలోని ఉత్తర కేరళ కర్ణాటక నుంచి తమిళనాడు కేరళ మీదుగా నైరుతి బంగాళాఖాతం వరకు సగటు సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజులు రాష్ట్రంలోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కిందిస్థాయి బలమైన గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయని పేర్కొంది.
ఇదీ చూడండి: