హైదరాబాద్ మారథాన్‌కు యువత తరలివచ్చి ఫిట్నెస్ కాపాడుకోవాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ అన్నారు. హైదరాబాద్ రన్నర్స్, ఎయిర్టెల్ ఆధ్వర్యంలో గ్రేటర్లో రేపు, ఎల్లుండి మారథాన్ నిర్వహించనున్నారు. హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ ఎక్స్పోను ముషారఫ్ అలీ ప్రారంభించారు. గతంలో కన్నా నగరంలో ఫిట్‌నెస్‌పై యువతలో క్రేజ్ పెరుగుతోందని అలీ అన్నారు. 5కే, 10కే, 42కే ఫుల్ విభాగాల్లో మారథాన్ ఉన్నట్లు చెప్పారు. దేశంలో ఇది రెండో అతిపెద్ద మారథాన్ అని వెల్లడించారు.
'మారథాన్‌లో యువత పాల్గొనాలి' - హైదరాబాద్
గ్రేటర్ హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి నిర్వహించనున్న హైదరాబాద్ మారథాన్‌లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ముషారఫ్ అలీ పిలుపునిచ్చారు.
'మారథాన్‌లో యువత పాల్గొనాలి'