అమెరికా రోడ్డు ప్రమాదంలో సాహిత్‌రెడ్డి మృతి అమెరికాలోని నార్త్‌కరోలినాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భాగ్యనగర వాసి మృతి చెందాడు. హైదరాబాద్ నల్లకుంటలోని పద్మాకాలనీకి చెందిన జి.సాహిత్‌రెడ్డి అమెరికాలో కారు ఢీ కొన్న ఘటనలో చనిపోయాడు. మృతుడు మధుసూదన్‌రెడ్డి, లక్ష్మి దంపతుల పెద్ద కుమారుడు. తండ్రి బీహెచ్ఈఎల్ మాజీ ఉద్యోగి కాగా... తల్లి గృహిణి. తమ కుమారుడు ఇక లేడన్న నిజాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు తీవ్రమనోవేదనకు గురయ్యారు.
మూడేళ్ల క్రితం అమెరికాకు
సాహిత్‌రెడ్డి ఎమ్మెస్ చేయడానికి మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. గత సంవత్సరం చదువు పూర్తి చేసి... ఉద్యోగ శిక్షణ నిమిత్తం నార్త్ కరోలినాలో ఉంటున్నాడు. ప్రతి రోజూ మాదిరిగానే ఈనెల 11న ఉదయం 4 గంటలకు పక్కనే ఉన్న జిమ్‌కు వెళ్తుండగా కారు ఢీ కొని చనిపోయాడు. పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. స్నేహితుని గురించి ఎలాంటి సమాచారం లేకపోవడం వల్ల అతని స్నేహితులు సాహిత్ అదృశ్యమైనట్లు అక్కడి అధికారులకు ఫిర్యాదు చేశారు. చివరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసి తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తరలించేలా చూడాలని తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : డ్రగ్స్ కేసుపై వార్తలు పాతవే: అకున్ సబర్వాల్