రాష్ట్రంలో నీటిపారుదల శాఖలో ప్రభుత్వం ఇచ్చిన 116, 117, 118, 119 జీవోలను వెంటనే అమలు చేయాలని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని నీటిపారుదల శాఖ కార్యాలయ ఆవరణలో ఉద్యోగులు వంటావార్పు చేసి నిరసన చేపట్టారు. ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్యోగుల క్రమబద్ధీకరణ, పే ఫిక్సేషన్, సీనియారిటీ డిమాండ్లను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవోల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ వంటావార్పు - AGITATION
నీటిపారుదల శాఖలో ప్రభుత్వం ఇచ్చిన పలు జీవోలని వెంటనే అమలు చేయాలని హైదరాబాద్ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ వంటావార్పు