తెలంగాణ

telangana

Hyderabad Hotel Staff Beating Customers : బిర్యానీ తినడానికి రెస్టారెంట్​కు వెళ్తే.. తిట్లు.. తన్నులు వడ్డిస్తున్నారు!

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2023, 1:54 PM IST

Updated : Sep 12, 2023, 2:13 PM IST

Hyderabad Hotel Staff Beating Customers : హైదరాబాద్​లో రోజురోజుకు హోటల్​ నిర్వాహకుల ఆగడాలు పెరుగుతున్నాయి. నగరంలో కొన్ని హోటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎక్కడ చూసినా కస్టమర్లపై నిర్వాహకులు దాడులకు తెగబడుతున్నారు. ఎవరైనా ప్రశ్నించినా, ఫిర్యాదు చేసినా.. భోజనంతో పాటు తిట్లు, తన్నులు కూడా వడ్డిస్తున్నారు. హోటల్​లో ఫుడ్‌ ఆర్డరిచ్చాక ఆలస్యం కావడం, సిబ్బంది మాటతీరు, నాసిరకం పదార్థాలు, తాగునీరు, దుస్తులపై పడే ఆహారపదార్థాలు, బిల్లులు, జీఎస్​టీ వంటి అంశాల వద్ద వినియోగదారులతో నిర్వాహకులకు గొడవలు జరుగుతున్నాయి.

Hyderabad Hotel Staff T
Hyderabad Hotel Staff Turning on Customers

Hyderabad Hotel Staff Beating Customers :హైదరాబాద్ అంటే ఫుడ్ లవర్స్ అందరికీ గుర్తొచ్చేది దమ్ బిర్యానీ(Hyderabad Dum Biryani). ఇక అందుకే భాగ్యనగరం వ్యాప్తంగా ప్రతీ గల్లీలోనూ బిర్యానీ హోటళ్లు దర్శమిస్తుంటాయి. ఇలాహైదరాబాద్ బిర్యానీకి ఫేమస్అయింది. ఇక సండే వచ్చిందంటే జాలీగా రెస్టారెంట్​కు వెళ్లి అక్కడే బిర్యానీని ఆరగించేస్తుంటారు కొందరు. అలా వీకెండ్​లో ఫ్రెండ్స్, ఫ్యామిలీతో సరదాగా రెస్టారెంట్​కు వెళ్లి బిర్యానీ ఆరగిద్దామనుకున్న కొంతమంది కస్టమర్లు.. రెస్టారెంట్ సిబ్బంది, నిర్వాహకుల ప్రవర్తనతో విసిగిపోతున్నారు. కొన్నిసార్లు ఇరువురి మధ్య వాగ్వాదం.. గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కస్టమర్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి.

Hyderabad Restaurant Staff Beat Customer to Death :తాజాగా పంజాగుట్టలో హోటల్‌ మెరిడియన్‌కు ఆదివారం మిత్రులతో కలిసి వెళ్లిన యువకుడు విగతజీవిగా మారాడు. తనకు అదనంగా రైతా కావాలని అడిగినందుకు సిబ్బంది భౌతిక దాడికి తెగబడ్డారు. ఇలాగే నగరంలో కొన్ని హోటళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరైనా ప్రశ్నించినా, ఫిర్యాదు చేసినా.. భోజనంతో పాటు తిట్లు, తన్నులు తినిపిస్తున్నాయి. హోటల్​ పరిసరాల్లో బౌన్సర్లు, రౌడీషీటర్లను ఏర్పాటు చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది అర్ధమవుతుంది.

How to Prepare Hyderabadi Chicken Dum Biryani : సండే ధమాకా.. హైదరాబాదీ బిర్యానీ.. ట్రై చేయండిలా..!

ఔనా.. తర్వాత చూద్దాంలే : దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ హోటల్‌ వద్ద ఆదివారం వచ్చిందంటే చాలు.. బిర్యానీతీసుకెళ్లేందుకు గంటల కొద్ది వేచి చూడాలి. మాంసాహార వంటకాలతో గుర్తింపు పొందిన కొన్ని హోటళ్ల నిర్వాకంపై జీహెచ్‌ఎంసీ(Greater Hyderabad Municipal Corporation), పోలీసు అధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇలా భాగ్యనగరంలో ఎంతోమంది వినియోగదారులకు హోటళ్ల నిర్వాహకులు, సిబ్బంది నుంచి చేదు అనుభవం ఎదురవుతున్న మాట నిజమేనని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఫుడ్‌ ఆర్డరిచ్చాక ఆలస్యం, సిబ్బంది మాటతీరు, నాసిరకం పదార్థాలు, తాగునీరు, దుస్తులపై పడే ఆహారపదార్థాలు, బిల్లులు, జీఎస్​టీ వంటి అంశాల వద్ద వినియోగదారులతో నిర్వహకులకు గొడవలు జరుగుతున్నాయి.

మమ్మల్ని ఎవరు అడిగేది.. మా ఇష్టం :తినేతప్పుడు బిర్యానీలో బొద్దింక వచ్చిందని అడిగితే చిరుద్యోగిని చావబాదారు. రోజూ అందే ఉచిత ఆహారం దూరమవుతుందనే ఉద్దేశంతో బాధితుడినే నిందితుడిగా చేశారు. ఇది మధ్య మండలంలోని ఓ పేరున్న హోటల్‌పై పోలీసులు కురిపించిన అభిమానం. ఇదే హోటల్లో నిల్వ ఉంచిన మాంసం వండిపెడుతున్నారంటూ ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌(Food Inspector)కు ఫిర్యాదు చేసిన ఒక మహిళను వెయిటర్లు(Hotel Waiters) దుర్భాషలాడారు. పోలీసులు వాళ్లతో గొడవెందుకంటూ ఇరువురికి రాజీ కుదిర్చి.. తమ వాటా పట్టుకెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి.

మాదాపూర్‌లో తెల్లవారుజామున బిర్యానీ విక్రయించే నిర్వాహకులు మొదట్లో మర్యాదగానే వ్యవహరించేవారు. గిరాకీ పెరగటంతో వారి తీరు కూడా మారింది. ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తానని చెప్పినందుకు.. ఓ వినియోగదారుడి చెంప ఛెళ్లుమనిపించారు. టోలిచౌకీలోని ఒక హోటల్‌ నిర్వాహకులు భోజనం చేసేందుకు వచ్చిన జంటతో అనుచితంగా ప్రవర్తించారు. రాయదుర్గం-గచ్చిబౌలి వెళ్లే మార్గాల్లోని హోటళ్ల వద్ద వాహనాలు నిలిపినా.. ట్రాఫిక్‌ పోలీసులు(Traffic Police) పట్టించుకోరు.

Hyderabad Biryani : హైదరాబాదీలా మజాకా.. 6 నెలల్లో 72 లక్షల బిర్యానీలు లాగించేశారు

బిర్యానీ అంటే ప్రాణం! ఏడాదిలో ఎన్ని కోట్లు ఆర్డర్ చేశారంటే..

Last Updated : Sep 12, 2023, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details