వేసవి కాలమంటేనే మండే ఎండలు... అధిక ఉష్ణోగ్రతలు. భానుడి భగభగలకు తోడు ఊహించని విధంగా చోటు చేసుకునే అగ్ని ప్రమాదాలతో జరిగే నష్టం అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో వేసవిలో సంభవించే అగ్నిప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు అంటున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. అగ్ని ప్రమాదాల విషయంలో బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్‌మాళ్లు, సినిమా ధియేటర్లు, ఆస్పత్రుల నిర్వాహకులు ఎలా వ్యవహరించాలి.. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి 'ఈటీవీ- భారత్'తో పంచుకున్నారు.
'అగ్ని ప్రమాదాలతో జాగ్రత్త.. లేదంటే భారీ మూల్యం తప్పదు' - అగ్ని ప్రమాదాలపై అగ్ని మాపక శాఖ అధికారుల అవగాహన
వచ్చేది వేసవికాలం.. భానుడి భగభగలతో పాటు అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాలు ప్రజలను బెంబేలిత్తిస్తాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లాంటి ప్రధాన నగరాల్లో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటాయి. అందుకే ఎండాకాలం రాగానే అగ్నిమాపక అధికారులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటారు. జనసముదాయం అధికంగా ఉండే ప్రాంతాల్లో అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని.. ప్రతి శుక్రవారం వీటిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక శాఖాధికారులు వెల్లడించారు.
అగ్నిప్రమాదాలపై అవగాహన
Last Updated : Mar 12, 2021, 4:33 PM IST