తెలంగాణ

telangana

ETV Bharat / state

షిర్డీ సాయికి హైదరాబాద్​ భక్తుడి భారీ విరాళం.. ఎంతంటే..? - షిర్డీ సాయికి భారీ విరాళం

Hyderabad Devotee Donates RS.1 Crore to Shirdi : షిర్డీ సాయిబాబా ట్రస్టుకు హైదరాబాద్​కు చెందిన రాజేశ్వర్ అనే భక్తుడు భారీ విరాళం అందించారు. నాలుగు చెక్కుల ద్వారా రూ.కోటి విరాళం సమర్పించారు. తామిచ్చిన విరాళాన్ని పేదల వైద్యం కోసం వినియోగించాలని కోరుకుంటున్నట్లు రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా రాజేశ్వర్​ను సాయి ట్రస్ట్ సత్కరించింది.

shirdi
shirdi

By

Published : Jan 11, 2023, 4:44 PM IST

Hyderabad Devotee Donates RS.1 Crore to Shirdi : మహారాష్ట్రలోని షిర్డీకి వెళ్లే భక్తులు ఆ సాయినాథుడ్ని దర్శనం చేసుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. అదే విధంగా బాబా హుండీలో కానుకలు, విరాళాలను తమ స్థాయికి తగ్గట్లుగా సమర్పిస్తుంటారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో బాబాకు విరాళాలు అందాయి. తాజాగా సంవత్సరం ప్రారంభంలోనే షిర్డీ బాబాకు అతిపెద్ద విరాళం వచ్చింది. హైదరాబాద్​కు చెందిన ఓ భక్తుడు రూ.కోటి విరాళం అందించారు.

సాయిబాబా తన జీవిత కాలంలో ఆరోగ్య సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే సాయి సంస్థాన్ కూడా ఈ ఆరోగ్య సేవను ముందుకు తీసుకువెళుతోంది. పేదలకు వైద్యం అందించేందుకు సాయిబాబా సంస్థాన్ షిర్డీలో ఉచిత ఆసుపత్రులను నడుపుతోంది. ఆసుపత్రుల్లో వైద్యసేవల కోసం సాయి సంస్థాన్‌కు రూ.కోటి విలువ చేసే నాలుగు డీడీలు ఇచ్చానని రాజేశ్వర్ తెలిపారు. ఈ క్రమంలోనే భావోద్వేగానికి లోనైన రాజేశ్వర్.. బాబా ఇచ్చిన దానిని సాయిబాబాకు ఇచ్చే పని చేస్తున్నానన్నారు. సాయికి దానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు.

ఈ రోజు కోటి విరాళంతో పాటు మరో భక్తుడు సుబ్బారెడ్డి రూ.46 లక్షల విలువైన ఎక్స్‌రే మిషన్‌ను బాబాకు కానుకగా ఇవ్వాలని సంకల్పించారు. భక్తులు ఇచ్చే విరాళాలను సాయిబాబా భక్తుల సౌకర్యార్థం, రోజువారీ పనుల కోసం వినియోగిస్తున్నట్లు సాయిబాబా సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ జాదవ్ తెలిపారు. ఈ విరాళాన్ని సాయి సంస్థాన్‌కు చెక్కు ద్వారా అందించిన తరువాత ఈ ధార్మిక భక్తుడిని సాయి ట్రస్ట్ సత్కరించింది.

షిర్డీ సాయికి భారీ విరాళం సమర్పించిన హైదరాబాద్‌ భక్తుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details