గ్రేటర్ ప్రజలంతా తెరాస వైపే చూస్తున్నారని లోక్సభపక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆయన ఎన్నికల ఇన్ఛార్జ్గా ఉన్న మియాపూర్ 108 డివిజన్లో పలువురు నేతలను కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. హైదరాబాద్ అభివృద్ధి ఒక్క తెరాసతోనే సాధ్యమని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యం: నామ - గ్రేటర్ ఎన్నికలు
భాగ్యనగర అభివృద్ధి ఒక్క తెరాసతోనే సాధ్యమని లోక్సభపక్షనేత, ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. మియాపూర్ 108వ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు. గ్రేటర్ ప్రజలంతా తమ వైపే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ అభివృద్ధి తెరాసతోనే సాధ్యం: నామా
తెరాస నాయకులు అన్వర్ షరీఫ్, గంగాధర్ల ఆధ్వర్యంలో పలువురు పార్టీలో చేరారు. కేసీఆర్, కేటీఆర్ల నాయకత్వంలో భాగ్యనగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. శాంతిభద్రతల విషయంలో దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నామని ఎంపీ తెలిపారు. అందుకే నగరంలో పెద్దపెద్ద కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు చంద్రిక ప్రసాదరావు, పురుషోత్తం, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:'ప్రభుత్వానికి చెందవు.. ఎవరైనా ప్రకటనలు పెట్టుకోవచ్చు'
Last Updated : Nov 23, 2020, 8:02 PM IST