Hyderabad Cricket Association Elections 2023 : ఎట్టకేలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఏడాది కిందటే హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్ధీన్‌పదవీకాలం ముగిసింది. కానీ ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించలేదు. అజారుద్ధీన్ అధ్యక్షుడిగా కొనసాగినన్ని రోజులు హెచ్‌సీఏపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమై.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. సాయంత్రం ఆరు గంటల్లోపు హెచ్‌సీఏ ఎన్నికల అధికారి(Electoral Officer) ఫలితాలను ప్రకటించనున్నారు. ఈసారి హెచ్‌సీఏ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఈ ఎన్నికల్లో మొత్తం నాలుగు ప్యానళ్లు తలపడుతుండగా.. ప్రధాన పోటీ గులాబీ వర్సెస్ కమలంగా కనిపిస్తోంది. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి.
Rachakonda Police Instructions to HCA Representatives : 'వార్మప్ మ్యాచ్‌కు ప్రేక్షకులను వద్దు..' హెచ్‌సీఏకు పోలీసుల సూచన
ఈ ఎన్నికల్లో మొత్తం 173 మంది ఓటర్లు తమ ఓటు హక్కును(Right to Vote) వినియోగించుకోనున్నారు. నాలుగు ప్యానల్స్ పోటీ చేస్తుండగా.. ప్రధానంగా త్రిముఖ పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. యునైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్‌సీఏ, గుడ్ గవర్నెన్స్ ప్యానల్, క్రికెట్ ఫస్ట్ అనే ప్యానెల్స్ మధ్య రసవత్తర పోరు జరగనుంది. యూనైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్‌కు అధికార బీఆర్ఎస్(BRS Party) మద్దతు ఇస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.
ప్యానల్ పరివారం వివరాలు..యునైటెడ్ మెంబెర్స్ ఆఫ్ హెచ్‌సీఏ ప్యానల్ నుంచి అధ్యక్షుడిగా జగన్ మోహన్ రావు, ఉపాధ్యక్షుడిగా శ్రీధర్, కార్యదర్శిగా హరి నారాయణరావు, సహాయకార్యదర్శిగా నోయోల్ డేవిడ్, కోశాధికారిగా శ్రీనివాస్ రావు, కౌన్సిలర్‌గా వినోద్ అన్సార్ అహ్మాద్ ఖాన్ పోటీ చేస్తున్నారు. గుడ్ గవర్నెన్స్ ప్యానల్ అధ్యక్షుడిగా అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడిగా దళ్ జీత్ సింగ్, కార్యదర్శిగా ఆగం రావు, కోశాధికారి - మహేంద్ర, జాయింట్ సెక్రటరీ - బసవ రాజు, కౌన్సిలర్ వినోద్ ఇంగ్లే పోటీ చేస్తున్నారు.
హెచ్‌సీఏపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్... అజారుద్దీన్ రియాక్షన్ ఏంటంటే?
Contesting Members Details in HCA :శివలాల్ యాదవ్, హర్షద్ అయూబ్ క్రికెట్ ప్యానల్(Cricket Panel).. క్రికెట్ ఫస్ట్ అనే ప్యానెల్‌తో బరిలోకి దిగుతోంది. ఈ ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా అమర్ నాథ్, ఉపాధ్యక్షుడు - జీ శ్రీనివాస్, కోశాధికారి - సంజీవి రెడ్డి, కార్యదర్శి - ఆర్ దేవరాజ్, సహాయకార్యదర్శి - చిట్టి శ్రీధర్, కౌన్సిలర్ సునీల్ అగర్వాల్ పోటీ చేస్తున్నారు. హానెస్ట్, హార్డవర్కింగ్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్యానల్ నుంచి అధ్యక్షుడిగా - పీఎల్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు - సీ బాబురావు, కార్యదర్శి - ఆర్‌ఎమ్ భాస్కర్. సహాయ కార్యదర్శి - రోహిత్ అగర్వాల్, కోశాధికారి - గెరార్డ్ కార్, కౌన్సిలర్ - డీఏజే వాల్తేరు పోటీ చేస్తున్నారు.
ODI World Cup 2023 Hyderabad Schedule : ఉప్పల్ మ్యాచ్ రీ షెడ్యూల్ పై స్పందించిన బీసీసీఐ!
ODI Worldcup 2023 : బీసీసీఐకి.. హెచ్‌సీఏ, హైదరాబాద్ పోలీసులు షాక్!