తెలంగాణ

telangana

ETV Bharat / state

స్పెషల్​ బ్రాంచ్​ పోలీసుల కృషి అభినందనీయం - hyderabad special branch police latest news

హైదరాబాద్ నగరంలో స్పెషల్‌ బ్రాంచ్ పోలీసుల కృషి ఎనలేనిదని సీపీ అంజనీకుమార్ అన్నారు. స్పెషల్‌ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ తరుణ్ జోషితోపాటు పలువురు జోన్ల అధికారులతో ఆయన సమావేశమయ్యారు.

cp anjanikumar appreciate to special branch police
స్పెషల్​ బ్రాంచ్​ పోలీసుల కృషి అభినందనీయం

By

Published : Jun 22, 2020, 7:14 PM IST

హైదరాబాద్​లో స్పెషల్​ బ్రాంచ్​ జాయింట్​ కమిషనర్​ తరుణ్​ జోషితో పాటు పలువురు జోన్ల అధికారులతో సీపీ అంజనీకుమార్​ సమావేశమయ్యారు. నగరంలో స్పెషల్​ బ్రాంచ్​ పోలీసుల పనితీరును ఆయన కొనియాడారు.

ఇంతకు ముందు వరకు పాస్‌పోర్టుల జారీలు, భద్రతా పరమైన చర్యల్లో నిమగ్నమైన పోలీసులు... గత నాలుగైదు నెలలుగా కొవిడ్ బాధితుల సంబంధికులను గుర్తించేందుకు తీవ్రంగా కృషి చేశారన్నారు. ఆ విభాగంలో పనిచేసిన సిబ్బందికి రివార్డులు అందించి సత్కరించారు.

ఇదీ చూడండి:తెలంగాణకు కొత్తగా కేటాయించేది మూడు రైళ్లేనా ?

ABOUT THE AUTHOR

...view details