మృతదేహంపై ఉన్న ఆనవాళ్ల ఆధారంగా రాజుగా గుర్తించినట్లు హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ (CP ANJANI KUMAR) తెలిపారు. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు రాజు ప్రాథమిక గుర్తులను కుటుంబ సభ్యులతో నిర్ధారించుకున్నట్లు స్పష్టం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకోలేననే భయంతోనే నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారమిచ్చినట్లు వెల్లడించారు.
ప్రాథమిక ఆనవాళ్ల ఆధారంగానే అతని కుటుంబ సభ్యులు మృతదేహం రాజుదేనని నిర్ధారించారని సీపీ తెలిపారు. అతనికి ఒక చేతిపై తెలుగులో మౌనిక అని, మరో చేతిపై ఇంగ్లీష్‌లో పేరు ఉన్నట్లు వెల్లడించారు. అతని కుడిచేతిపై ఐదు స్టార్ గుర్తులు కూడా ఉన్నాయని సీపీ పేర్కొన్నారు. ఘటన జరిగిన తర్వాత ఆరు రోజులుగా అతని కోసం రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు. అందువల్లనే పోలీసుల నుంచి తప్పించుకోలేనని అతడు భావించి ఉంటాడని సీపీ అన్నారు. పోలీసులకు దొరికి పోతానన్న భయంతోనే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని సీపీ అంజనీ కుమార్ స్పష్టం చేశారు.
ఈరోజు ఉదయం వరంగల్ జిల్లాలో స్టేషన్ ఘన్పూర్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై మృతదేహం దొరికింది. ప్రాథమిక గుర్తుల ప్రకారం అతని ఒక చేతిలో మౌనిక అని తెలుగులో, మరో చేతిపై ఇంగ్లీష్‌లో ఉంది. ఐదు స్టార్ గుర్తులు కుడా ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాం. వారు కూడా రాజుదేనని నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఆరు రోజులుగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోలేనని అతను భావించాడు. పోలీసులకు దొరికిపోతానన్న భయంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. - అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ
మంత్రి కేటీఆర్ ట్వీట్