తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది' - రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం... పోలీసులకు పూర్తి సహకారం కల్పించడం మంచి పరిణామమని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు. అత్యవసర సేవలకు మినహాయింపులు కల్పించినట్లు ఆయన స్పష్టం చేశారు.

cp anjani kumar on janatha curfew
'ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది'

By

Published : Mar 22, 2020, 12:02 PM IST

ప్రజా భద్రతా కోసం మేమంతా పనిచేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధంలోకి వెళ్లడం మంచి పరిణామమని పేర్కొన్నారు. భవిష్యత్‌లోనూ ఇలాంటి స్ఫూర్తినే కొనసాగించాలని కోరుతున్నట్లు సీపీ వెల్లడించారు.

కేవలం అత్యవసర సేవల్లో మాత్రమే మినహాయింపులు ఇచ్చినట్లు అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. రైళ్ల ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​కు చాలా మంది వచ్చారని... స్టేషన్‌లో ఉన్న ప్రయాణికుల కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు.

'ప్రజల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది'

ఇవీ చూడండి:'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'

ABOUT THE AUTHOR

...view details