రంజాన్ సందర్భంగా ప్రజలు ఇంట్లోనే ప్రార్థనలు చేసుకోవాలని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ సూచించారు. మసీదులో నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటికే రాజకీయ నాయకులు, మతపెద్దలతో ఈ విషయమై చర్చించామని తెలిపారు. రంజాన్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
'ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలి... మసీదులో నలుగురికే అనుమతి'
ముస్లిం ప్రజలకు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు. మసీదులో నలుగురికే అనుమతి ఉన్నట్లు స్పష్టం చేశారు.
'ఇంట్లోనే ప్రార్థనలు జరుపుకోవాలి... మసీదులో నలుగురికే అనుమతి'
ట్యాంక్‌బండ్ ప్రాంతంలో లాక్‌డౌన్ అమలుతీరును సీపీ పరిశీలించారు. రాజధానిలో లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతోందన్న సీపీ... సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నగరంలోని అన్ని జోన్లలో 12వేల మంది పోలీసులు, నాలుగు వేల మంది హోంగార్డులు విడతల వారీగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రాష్ట్రంలో పటిష్టంగా అమలవుతున్న లాక్‌డౌన్
Last Updated : May 13, 2021, 2:33 PM IST