తెలంగాణ

telangana

ETV Bharat / state

CC Camera Inauguration at golkonda: 'తెలంగాణ జీడీపీలో సీసీకెమెరా కీలకపాత్ర' - Cc camera news

CC Camera Inauguration at golkonda: హైదరాబాద్ గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో నేను సైతం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 100 సీసీ కెమెరాలను సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, ఇతర పోలీస్ అధికారులు, అసిఫ్‌నగర్ డివిజన్ వాసులు పాల్గొన్నారు.

CC Camera Inauguration
CC Camera Inauguration

By

Published : Dec 14, 2021, 3:26 PM IST

CC Camera Inauguration at golkonda: సీసీ కెమెరాల ఏర్పాటుతో హైదరాబాద్ నగరంలో నేరాలు అదుపులోకి వచ్చాయని నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. హైదరాబాద్ వెస్ట్​జోన్ గోల్కొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో 100 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజలు, దాతల సాయంతో రూ. 30 లక్షల వ్యయంతో వీటిని ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు.

Hyd Cp Anjani Kumar: ఒక్క సీసీ కెమెరా వంద కానిస్టేబుళ్లతో సమానమని ఆయన అన్నారు. సీసీ కెమెరా ద్వారా ఎలాంటి క్రైమ్ అయినా ఇట్టే పరిష్కారమవుతోందని సీపీ తెలిపారు. వీటి ద్వారా నేరగాళ్లకు శిక్ష పడుతున్నాయన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు ద్వారా ప్రజల్లో మరింత భరోసా పెరిగిందన్నారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా సిటీలో మరికోన్ని చోట్ల సీసీ కెమెరాల ఏర్పాటు చేస్తామని సీపీ వెల్లడించారు. గుజరాత్, మహారాష్ట్ర జీడీపీ రేటుతో పోలిస్తే తెలంగాణ జీడీపీ రేటు అదనంగా పెరిగిందని... ఇందుకు కారణం శాంతి భద్రతలు అదుపులో ఉండటమే కారణమని సీపీ పేర్కొన్నారు. భవిష్యత్ తరాల భద్రత కోసం సీసీ కెమెరా అవసరమని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details