తెలంగాణ

telangana

ETV Bharat / state

చైన్‌ స్నాచింగ్ కేసు.. దొంగలు ఇద్దరు కాదు నలుగురు - హైదరాబాద్ చైన్ స్నాచింగ్ కేసు న్యూస్

Hyderabad Chain Snatching Case Update : హైదరాబాద్ మహానగరంలో ఈనెల 7న సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొందరు దుండగులు వరుస చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. నలుగురు వ్యక్తులు రెండు ముఠాలుగా ఏర్పడి దొంగతనానికి పాల్పడ్డారని గుర్తించారు.

Chain Snatching
Chain Snatching

By

Published : Jan 9, 2023, 12:15 PM IST

Hyderabad Chain Snatching Case Update : రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన హైదరాబాద్ చైన్ స్నాచింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ దోపిడీకి పాల్పడింది నలుగురు వ్యక్తులను గుర్తించారు. రెండు ముఠాలుగా విడిపోయి సికింద్రాబాద్ పరిధిలోని ఆరు ప్రాంతాల్లో గొలుసు దొంగతనాలు చేశారని తెలిపారు. యూపీకి చెందిన పింకు, అశోక్‌తో పాటు మరో ఇద్దరు నిందితులు ఈ ముఠాలో భాగమని వెల్లడించారు.

"యూపీకి చెందిన పింకు, అశోక్‌, మరో ఇద్దరు నిందితులు హైదరాబాద్‌కు వచ్చారు. యూపీ నుంచి విమానంలో వచ్చి నాంపల్లిలో ఓ లాడ్జిలో బస చేశారు. కోఠిలో బైక్ చోరీ చేసి ఆరు చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. చోరీ తర్వాత పారిపోయేందుకు ఎంజీబీఎస్, జేబీఎస్‌కు వెళ్లారు. చోరీ తర్వాత కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు పారిపోయారు." అని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

Chain Snatching Case Update : పోలీసుల తనిఖీలు ఉండడంతో నిందితులు మరిన్ని చోరీలకు పాల్పడకుండా వెనక్కి తగ్గినట్లు సమాచారం. మెహిదీపట్నం, గోల్కొండ ప్రాంతాల్లో నిందితులు ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. 2016లో పింకు, అశోక్ రాచకొండ పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జైలు నుంచి బయటకు వచ్చి బెంగుళూరు, హైదరాబాద్‌లో మళ్లీ దొంగతనాలు షురూ చేసినట్లు తెలిపారు. నిందితులను వీలైనంత త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు.

అసలేం జరిగిందంటే.. ఈనెల 7వ తేదీన ఉదయం ఆరు గంటల నుంచి 8.30 గంటల వరకు దాదాపు రెండు గంటల పాటు సికింద్రాబాద్ పరిధిలోని ఆరు ప్రాంతాల్లో గొలుసు దొంగలు విరుచుకుపడ్డారు. మార్నింగ్ వాక్ చేసే ఒంటరి మహిళలనే టార్గెట్ చేసి చైన్‌లు తెంపుకుపోయారు. దాదాపు ఏడాది తర్వాత నగరంలో తెంపుడుగాళ్లు మళ్లీ కనిపించారు. వారు చైన్ స్నాచింగ్ చేస్తున్న దృశ్యాలు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details