తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజు నియంత్రణ తీసుకురావాలి'

ప్రైవేటు ఆస్పత్రుల్లో.. రూ.2 నుంచి 5 లక్షల వరకు చికిత్సలను ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ భాజపా అధ్యక్షులు గౌతమ్ రావు కోరారు. ఆయా ఆస్పత్రుల్లో ఫీజు నియంత్రణ తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

cm kcr farm house
cm kcr farm house

By

Published : May 23, 2021, 7:48 PM IST

ప్రజలను మభ్యపెట్టి మొక్కుబడిగా రెండు, మూడు ఆస్పత్రులను సందర్శించిన సీఎం కేసీఆర్.. మళ్లీ ఫామ్ హౌస్ బాట పట్టారని హైదరాబాద్ భాజపా అధ్యక్షులు గౌతమ్ రావు ఎద్దేవా చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజు నియంత్రణ తీసుకురావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చేయూతనిస్తూనే ఉంటుందన్నారు.

ఐసోలేషన్ వార్డులు చిన్నవిగా ఉన్నాయని... స్కూళ్లు, ఫంక్షన్ హాళ్లను కొవిడ్​ వార్డులుగా తీర్చిదిద్దాలని గౌతమ్ సూచించారు. ఆయుష్మాన్ భారత్​లో ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో.. రూ. 2 నుంచి 5 లక్షల వరకు చికిత్సలను ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో.. హైదరాబాద్ ఓబీసీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, సిటీ అధికార ప్రతినిధి జ్యోతి రెడ్డి, బీజేవైఎం సెంట్రల్ జిల్లా అధ్యక్షులు సందీప్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details