Hyderabad Airport is the World's Most Punctual Airport : దేశంలోనే మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం మరో అరుదైన ఘనతను కైవసం చేసుకొంది. ప్రపంచంలోనే అత్యంత సమయపాలన (టైమ్ పంక్చువాలిటీ) కలిగిన విమానాశ్రయంగా రికార్డులోకి ఎక్కింది. ఈ మేరకు ఏవియేషన్ అనలిటికల్ సంస్థ ‘సిరియమ్’ (సీఐఆర్‌ఐయూఎం) ఇటీవల విడుదల చేసిన నివేదికలో శంషాబాద్ విమానాశ్రయం మార్చి నెలలో 90.43 శాతం ఆన్-టైమ్ పెర్ఫార్మెన్స్ నమోదు చేసినట్లు ప్రకటించింది.
Hyderabad Airport is Most Punctual : సమయపాలనలో 90 శాంతం మార్కును దాటిన ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయంగా శంషాబాద్ విమానాశ్రయం నిలిచింది. గతేడాది నవంబర్‌లో సమయపాలన నివేదికలో 88.44 శాతంతో నాల్గో స్థానంలో ఉన్న ఉండగా కేవలం 4 నెలల్లోనే ప్రథమ స్థానం దక్కించుకుందని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. సిరియమ్ సంస్థ మార్చి నెలలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని 50 లక్షల విమానాల రాకపోకలను విశ్లేషించింది. ఈ క్రమంలోనే సమయ పాలనతోపాటు ‘గ్లోబల్ ఎయిర్‌పోర్ట్’ ‘లార్జ్ ఎయిర్‌పోర్ట్’ విభాగాల్లోనూ శంషాబాద్ అగ్రస్థానంలో నిలిచింది.
World most punctual airport award to Hyderabad Airport : సిరియమ్ సంస్థ చేసిన సర్వేలో వాస్తవ నిష్క్రమణ సమయం (డిపార్చర్) 80 శాతం, ప్రయాణికులు లోపలికి అడుగుపెట్టాక విమానం ఎక్కే సమయం, విమానాశ్రయ సేవల అంశాలను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించింది. ఈ మూడు అంశాల్లో అత్యుత్తమంగా శంషాబాద్ విమానాశ్రయం నిలిచిందని విమానాశ్రయ సీఈవో ప్రదీప్ ఫణికర్ ప్రకటించారు.