తెలంగాణ

telangana

ETV Bharat / state

'మోదీ సభతో భాజపాకు అనుకూల పవనాలు' - కమలనాథులు

దేశంలో సమస్యలు పరిష్కరించే సత్తా ఒక్క మోదీకే ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని సికింద్రాబాద్​ భాజపా అభ్యర్థి కిషన్​రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో రోడ్​షో నిర్వహించారు.

మోదీ సభతో నగరంలో భాజపా అనుకూల పవనాలు

By

Published : Apr 3, 2019, 6:01 AM IST

Updated : Apr 3, 2019, 6:43 AM IST

మోదీ సభతో నగరంలో భాజపా అనుకూల పవనాలు
అభ్యర్థుల గుణ గణాలను చూసి ఓటు వేయాలని సికింద్రాబాద్​ లోక్​సభ భాజపా అభ్యర్థి కిషన్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎల్బీ స్డేడియంలో జరిగిన ప్రధాని సభతో నగరంలో భాజపాకు అనుకూల వాతావరణం ఏర్పడిందన్నారు. దేశంలోని ఏళ్లనాటి సమస్యలు పరిష్కరించే సత్తా మోదీకే ఉందని ప్రజలందరూ విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రోడ్​షో నిర్వహించారు. అన్ని వర్గాల ప్రజలు తమకు అండగా నిలవాలని కోరారు.

హైదరాబాద్​ సమస్యలు పరిష్కారం కావాలంటే కమలనాథులను గెలిపించాలని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ కోరారు. సనత్​నగర్​లో పార్టీ కార్యాలయాన్ని కిషన్​రెడ్డితో కలిసి ప్రారంభించారు. సికింద్రాబాద్​లో కాషాయ జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాజపా శ్రేణులు పాల్గొన్నారు.

Last Updated : Apr 3, 2019, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details