ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితాల్లో చోటు చేసుకున్న తప్పిదాలతో 20మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా పరిగణిస్తోంది. తెరాస ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది.
ఆత్మహత్యలు వద్దు
ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఇవాళ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్యలు వద్దు పేరుతో భారీ సంతకాల సేకరణ, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు ఓదార్పు చేపట్టనుంది.
రేపు కొవ్వొత్తుల ర్యాలీ
చనిపోయిన విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ రేపు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తమ శ్రేణులకు సూచించారు. వరుస నిరసనలతో నిరంకుశ తెరాస సర్కారు తీరును ఎండగట్టి, విద్యార్థి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు.
ఇవీ చూడండి: మానవ మృగాడిని పట్టుకున్న పోలీసులు