రెండు నెలల పాటు సాగిన ప్రదర్శన
2 వేలకు పైగా స్టాళ్లతో దాదాపు రెండు నెలల పాటు సాగిన ప్రదర్శనలో అగ్ని ప్రమాదంతో అపశ్రుతి చోటుచేసుకుంది. స్వల్ప ఆస్తినష్టం జరగ్గా రెండు రోజుల అనంతరం వివిధ శాఖల సమన్వయంతో యుద్ధ ప్రాతిపదికన నుమాయిష్‌ను తిరిగి ప్రారంభించారు.
వ్యాపారులను ఆదుకునేందుకు ఈనెల 15వ తేదీతో ముగియాల్సిన ప్రదర్శనను 24 వరకు పొడిగించారు. నుమాయిష్ చివరి రోజు ఆదివారం కావటంతో పెద్ద ఎత్తున నగరవాసులు సందర్శిస్తారని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
నేటితో నుమాయిష్ ఆఖరు - nampally
నాంపల్లిలో జరుగుతున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 79వ ఎడిషన్ ఈరోజుతో ముగుస్తుంది. శుక్రవారం ముగింపు వేడుకల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
నేటితో నుమాయిష్ ఆఖరు