భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య - గర్భిణి ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్లో భర్త వేధింపులు తట్టుకోలేక సమీనా భాను అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య
మేడ్చల్ జిల్లా నేరేడ్మెట్ వినాయక్ నగర్లో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక పెళ్లైన 5 నెలలకే సమీనా భాను అనే వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త డబ్బుల కోసం ఇబ్బంది పెట్టడం వలనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు ఆరోపించారు. భర్త సాయి చరణ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మరణంతో కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.