తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనాతో భర్త మృతి.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య - హైదరాబాద్ కరోనా వార్తలు

హైదరాబాద్ చింతల్​లోని ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కరోనాతో భర్త మృతి చెందడంతో.. ఆ బాధను జీర్ణించుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. గంట వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

covid death
కరోనాతో మృతి

By

Published : May 9, 2021, 9:24 PM IST

కరోనాతో భర్త మృతి చెందడంతో.. భార్య ఆ బాధను జీర్ణించుకోలేకపోయింది. ఐసోలేషన్​లో ఉన్న ఆమె.. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన హైదరాబాద్​లోని చింతల్​లో చోటుచేసుకుంది.

గణేశ్​ నగర్​కు చెందిన భార్యాభర్తలు ఆదినారాయణ, కనకదుర్గ.. వారి కుమారుడు నవీన్​ పది రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. ఐసోలేషన్​లో ఉన్న ముగ్గురిలో ఆదినారాయణ పరిస్థితి విషమించడంతో.. నాలుగు రోజుల క్రితం అతడిని షాపూర్ నగర్​లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆదినారయణ ఆదివారం ప్రాణాలు విడిచారు.

సమాచారం అందుకున్న భార్య కనకదుర్గ.. తీవ్ర మనస్తాపానికి గురైంది. ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గంట వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇదీ చదవండి:వాలంటీర్ లక్ష్మి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమా..?

ABOUT THE AUTHOR

...view details