తెలంగాణ

telangana

ETV Bharat / state

Husband commits suicide after killing his wife : మద్యం మత్తులో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య - మద్యం మత్తులో భార్యను చంపి భర్త ఆత్మహత్య

Husband commits suicide after killing his wife : మద్యం మత్తులో జరిగే దారుణాలు ఎన్నో... పీకలదాక తాగి మందుబాబులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. కొందరైతే ఘర్షణలకు కూడా దిగుతుంటారు. ఆరోజు సంపాదించినదంతా తాగుడికే ఖర్చు చేసి ఇంటికొచ్చి భార్యలను కొట్టడం మన వద్ద మామూలైపోయింది. ఇలా మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్యను రాడ్డుతో కొట్టి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. అసలేం జరిగిందంటే..!

Husband commits suicide by killing his wife
Husband commits suicide by killing his wife

By

Published : May 16, 2023, 4:44 PM IST

Updated : May 16, 2023, 4:53 PM IST

Husband commits suicide by killing his wife in SR Nagar : ఈ మధ్యకాలంలో చిన్నపాటి కారణాలకే క్షణికావేశంలో చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. చదువుకునే విద్యార్థుల దగ్గర నుంచి కాటికి కాలు చాచిన వృద్ధుల వరకూ చాలా మంది తమ సమస్యలకు బలవన్మరణమే పరిష్కారమని భావిస్తూ తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. సిల్లీ కారణాలతో మనస్తాపం చెంది జీవితాలను అర్ధాంతరంగా మధ్యలోనే ముగిస్తున్నారు.

ఇకపోతే ప్రేమ పేరుతో బలవుతున్న ప్రాణాలకు లెక్కే లేదు. అలాగే కొంత మంది మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా ప్రవర్తిస్తారు. వారు చెప్పిందే చేయాలని లేకుంటే ఎంతటి పనికైనా వెనుకాడరు. మద్యం మత్తులో పిల్లల్ని చంపడం.. తల్లి మీద డబ్బులకు దాడి చేయడం.. హత్యలు చేయడం లాంటివి మనం చూస్తూనే ఉన్నాం. మద్యం హానికరం అని పెద్దవాళ్లు ఎన్ని చెప్పినా మనుకోరు. దానివల్ల ఎందరో తన కుటుంబాలను దూరం చేసుకుంటున్నారు. ఈ మద్యం వలన నా అనుకునే వారు లేక ఎంతోమంది రోడ్డున పడిన వారిని మనం నిత్యం చూస్తునే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్​లోని ఎల్లారెడ్డి గూడలో చోటుచేసుకుంది.

భార్యను చంపి.. భర్త ఆత్మహత్య: మద్యం మత్తులో భార్యను ఇనుపరాడ్డుతో కొట్టి చంపిన భర్త జనార్ధన్​, ఆమెను చంపిన తర్వాత ఇంటిలోని హాలులో ఫ్యానుకు తాను ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని ఎల్లారెడ్డి గూడలో నివాసముంటున్న జనార్దన్ (40), ప్రేమలత(35) దంపతులు. వారికి 2004లో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు ఒక పాప.

పెళ్లైన దగ్గర నుంచి జనార్దన్ మద్యానికి అలవాటు పడ్డాడు. భార్యభర్తలకు తరచు గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలోనే భార్తభర్తలు ఇద్దరు.. ప్రేమలత తల్లిదండ్రుల పెళ్లిరోజు ఫంక్షన్​కు వెళ్లారు. ఫంక్షన్​ అయ్యక తిరిగి సొంత ఇంటికి వచ్చి రోజులాగే గొడవ పడ్డారు. అయితే మద్యం మత్తులో ఉన్న భర్త జనార్దన్ భార్యను చంపినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ప్రేమలతను రాడ్​తో కొట్టి చంపి, తర్వాత భర్త జనార్ధన్​ చున్నీతో ఫ్యాన్​కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.

ఇవీ చదవండి:

Last Updated : May 16, 2023, 4:53 PM IST

ABOUT THE AUTHOR

...view details