తెలంగాణ

telangana

ETV Bharat / state

చక్రాల కుర్చీ లేదు.. చేతులే దిక్కయ్యాయి! - తెలంగాణ న్యూస్ అప్​డేట్స్

భార్య నడవలేని పరిస్థితి... వైద్యం కోసం లోపలికి వెళ్లేందుకు చక్రాల కుర్చీ సాయం కోరగా.. స్పందన కరవైంది. చేసేదేమీ లేక భర్త.. ఆమెను చేతులపై ఎత్తుకుని తీసుకుని వెళ్లాడు. ఈ దృశ్యం అందరినీ కదిలించింది. ఈ ఘటన సికింద్రాబాద్​లో చోటుచేసుకుంది.

Regimental Bazaar
Regimental Bazaar

By

Published : May 15, 2021, 9:13 AM IST

కోల్‌కతాకు చెందిన ప్రమోద్‌గిరి, భవితగిరి భార్యాభర్తలు. కుమార్తె, అల్లుడు కుత్బుల్లాపూర్‌లో ఉంటారు. కొన్నాళ్ల క్రితం నడుస్తూ జారిపడటంతో.. భవితగిరికి నడుం వద్ద దెబ్బతగిలింది. వైద్యం అందించగా.. నడవలేని పరిస్థితి నుంచి ప్రస్తుతం పట్టుకుని ఉంటే నిలబడే స్థితికి వచ్చారు. అల్లుడి సలహా మేరకు నగరంలో మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైల్లో శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైలు దిగే సమయంలో టీటీఈని చక్రాల కుర్చీ సాయం కోరగా.. స్పందన కరవైంది.

అల్లుడు ఈ విషయాన్ని తెలిపి.. లోపలికి వెళ్లేందుకు యత్నించగా రైల్వే సిబ్బంది అడ్డుకున్నారు. చేసేదేమీ లేక భర్త.. ఆమెను చేతులపై ఎత్తుకుని ఆరో నంబర్‌ ప్లాట్‌ఫాం నుంచి బయటకు వచ్చారు. దీనిపై స్టేషన్‌ మేనేజర్‌ జయరాం వివరణ ఇస్తూ.. వీల్‌ఛైర్లు అందుబాటులో ఉన్నాయని, విచారణ కేంద్రం వద్ద అడిగితే సమకూర్చుతారని చెప్పారు.

ఇదీ చదవండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details