హైదరాబాద్ పాతబస్తీ ఉప్పర్గూడలోని రామాలయం నిర్వాహకులు.. గుడి హుండీలోని రూ. 51వేలను, రామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి విరాళంగా అందజేశారు. ఆలయ ఆదాయాన్ని అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వడం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
రామ మందిరానికి విరాళంగా.. హుండీ ఆదాయం - హైదరాబాద్
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం.. రాష్ట్ర వ్యాప్తంగా నిధి సమర్పణ కార్యక్రమాలు జోరుగా సాగుతోన్నాయి. రామ భక్తులు.. ప్రతి ఇల్లు తిరిగి నిధులు సేకరిస్తున్నారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో తమకు తోచినంత విరాళమిస్తున్నారు. ఇలాగే పాతబస్తీలోని ఓ రామాలయం నిర్వాహకులు.. గుడి హుండీలోని నగదును, రామ జన్మభూమి తీర్థ క్షేత్రానికి విరాళంగా అందజేశారు.
రామ మందిరానికి విరాళంగా.. హుండీ ఆదాయం
మందిరం నిర్మాణం కోసం రాష్ట్ర వ్యాప్తంగా నిధి సమర్పణ కార్యక్రమాలు జోరుగా సాగుతోన్నాయి. రామ భక్తులు.. ప్రతి ఇల్లు తిరిగి నిధులు సేకరిస్తున్నారు. ప్రజలు కూడా తమకు తోచినంత విరాళమిస్తున్నారు.
ఇదీ చదవండి:ఇంటింటా తిరుగుతూ.. రామ మందిరానికి నిధి సేకరణ