ఖమ్మం నగరంలో 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి యత్నించి.. బాలిక ప్రతిఘటించడంతో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పలు పత్రికలు, టీవీ ఛానల్స్‌లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసును స్వీకరించి విచారణకు ఆదేశించింది.
బాలికపై లైంగికదాడికి యత్నం... సుమోటోగా స్వీకరించిన హెచ్ఛార్సీ
ఖమ్మం జిల్లాలో కలకలం రేపిన 13ఏళ్ల బాలికపై అత్యాచార, హత్యాయత్నం కేసును పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. సమగ్ర విచారణ జరపాలని ఖమ్మం నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది.
బాలికపై లైంగికదాడికి యత్నం... సుమోటోగా స్వీకరించిన హెచ్ఛార్సీ
70 శాతం గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలిక కేసులో ఏ చర్యలు తీసుకున్నారో పోలీసులను హెచ్ఛార్సీ ఆదేశించింది. వచ్చే నెల 6వ తేదీలోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలంటూ ఖమ్మం నగర పోలీస్ కమిషనర్‌కు హెచ్ఛార్సీ ఆదేశాలు జారీ చేసింది.
ఇవీ చూడండి: బాలికపై దారుణానికి ఒడిగట్టిన కర్కశుడికి 14రోజుల రిమాండ్