నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ రవికుమార్ అన్నారు. తార్నాకలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడు సంవత్సరాలుగా నిర్భయ నిందితులకు శిక్ష ఎప్పుడు పడుతుందా అని చాలామంది నిరీక్షించారని తెలిపారు. ఈ శిక్షతో సగటు మనిషికి న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగిందన్నారు. ప్రస్తుతం సమాజంలో ఇంటి నుంచి అమ్మాయి బయటికి వెళ్తే తిరిగి ఎలా వస్తుందోనని ప్రతి ఒక్కరు భయపడుతున్నారని అసోసియేషన్ రాష్ట్ర అడ్వైజర్ లావణ్య అన్నారు.
'నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలును స్వాగతిస్తున్నాం'
నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలు చేయడం వల్ల సగటు మనిషికి న్యాయవ్యవస్థ మీద నమ్మకం కలిగిందని ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ రవికుమార్ అన్నారు.
'నిర్భయ నిందితులకు ఉరిశిక్ష అమలును స్వాగతిస్తున్నాం'