తెలంగాణ వ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి వేళల్లో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటకురాని పరిస్థితి. రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
ఎక్కడెంతంటే..
రాష్ట్ర వ్యాప్తంగా 44 నుంచి 46 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో అత్యధికంగా 45.9 గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవగా... తక్కువగా నమోదైన జిల్లాలు చూసుకుంటే... జోగులాంబ గద్వాల 42.6, ములుగు 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అప్పటి వరకు తప్పదు
జూన్ పదోతేదీ వరకు ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటాయని... రాగల మూడు రోజుల తర్వాత ఒకటి నుంచి రెండు డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన చోట క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి... ఆయా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న తెలిపారు.
ఇవి పాటించండి
అధిక ఉష్ణోగ్రతలు, అతినీల లోహిత కిరణాల వల్ల చర్మసంబంధ వ్యాదులు వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు చెబుతున్నారు. పిల్లలు, వృద్ధులు, మహిళలపై ఎండల ప్రభావం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గొడుగుతో పాటు గ్లూకోజ్ నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
మండుటెండలు.. మరో మూడు రోజులు ఇదీ చదవండి:రేపు ఎల్బీనగర్ వద్ద అండర్ పాస్, పైవంతెన ప్రారంభోత్సవం