Terrace Garden: ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగిపోతోంది. రసాయన అవశేషాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరల వినియోగం వల్ల.. సంభవిస్తున్న దుష్ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నగర సేద్యంపై జరిగిన అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది. నగరం నలుమూలల నుంచి ఔత్సాహిక గృహిణులు, యువతులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ఇతర గృహ యజమానులు తరలివచ్చారు. ఏ మాత్రం అవగాహన లేకపోయినా ఇంటి పంటలు సాగు చేసుచేసుకునేందుకు అవసరమైన విజ్ఞానం, మెళకువలు, సాంకేతిక పరిజ్ఞానం అందించారు. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆకుకూరలు, కూరగాయల పంటల సాగుకు.. అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నీటి యాజమాన్యాలు, కషాయాలు, వర్మీకంపోస్టు తయారీపై శిక్షణ ఇచ్చారు.
విస్తృతమవుతోన్న ఇంట పంటల సంస్కృతి
ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ పెరిగి స్వీయ ఇంటి పంటల సంస్కృతి విస్తృతమవుతోంది. జంట నగరాల్లో అదొక ఉద్యమ రూపం సంతరించుకుంది. ఐదారేళ్ల కిందట సరదాగా ప్రారంభించి.. మధ్యలో సరైన అవగాహన లేకపోవడంతో.. టెర్రస్, కిచెన్ గార్డెన్లు వదిలేసిన మహిళలు సైతం.. మళ్లీ తాజాగా ఉత్తేజితులై ముందుకు సాగుతున్నారు. సొంతంగా పండించుకుని ఆహారంలో భాగం చేసుకుని.. ఆస్వాదిస్తే ఆ కలిగే ఆనందమే వేరని శిక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. గృహ యజమానులు సైతం అందుకు అనువుగా స్థలం ఎంపిక చేసుకుని.. నిర్మించుకుంటే భవిష్యత్తులో టెర్రస్ గార్డెనింగ్ అందంగా తీర్చిదిద్దుకోవచ్చని ఇంటీరియర్ డిజైనర్లు చెబుతున్నారు.
నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు..