హైదరాబాద్ చార్మినార్ వద్ద గణనాథుల శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. వేలాది గణేశులు నిమజ్జనానికి తరలిస్తున్నారు. నిమజ్జనోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వివిధ రూపాల్లో ఉన్న లంబోదరుడి ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. శోభాయాత్ర మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
చార్మినార్ వద్ద గణనాథుల సందడి - charminar
చార్మినార్ వద్ద వేలాది గణనాథుల ప్రతిమలతో శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. నిమజ్జనోత్సవంలో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
చార్మినార్