తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపకులపతి పదవులు 9... దరఖాస్తులు 150

తొమ్మిది వర్సిటీల్లో వీసీల పదవీకాలం రేపటితో ముగియనుంది. కొత్త ఉపకులపతుల నియామకం కోసం సర్కారు కసరత్తు చేపట్టింది. నేటితో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియనుండగా... ఇప్పటికే సుమారు 150 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.

ఉపకులపతి పదవులు 9... దరఖాస్తులు 150

By

Published : Jul 23, 2019, 6:24 PM IST

ప్రస్తుత ఉపకులపతుల పదవీ కాలం నేటితో ముగియనున్నందున కొత్త వీసీల నియామకం కోసం ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానించింది. ఒక్కో ఆచార్యుడు నాలుగైదు యూనివర్సిటీల కోసం విద్యాశాఖ కార్యదర్శికి దరఖాస్తులను సమర్పించారు. యూజీసీ నిబంధనల ప్రకారం పదేళ్ల బోధనానుభవం ఉన్న వారు ఉపకులపతికి అర్హులు. ఆచార్యులుగా పనిచేస్తున్న వారు.. పదవీ విరమణ పొందిన వారు... ఉపకులపతి కుర్చీ కోసం పోటీ పడుతున్నారు.

అత్యధికంగా ఓయూ నుంచే....

అత్యధికంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సుమారు 60 మంది రేసులో ఉన్నారు. పదవీ విరమణ పొందిన ఆచార్యులు మరో ఇరవై మంది వరకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి విశ్వవిద్యాలయానికి సుమారు 10 మంది వరకు పోటీ పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్​తో సన్నిహితంగా ఉన్న నేతల చుట్టూ పలువురు ఆచార్యులు చక్కర్లు కొడుతున్నారు.

ఉపకులపతి పదవులు 9... దరఖాస్తులు 150

ఇదీ చూడండి: మంత్రివర్గ విస్తరణ ఉంటుందా? ఉండదా?

ABOUT THE AUTHOR

...view details