How to Search Polling Station in Online: రాష్ట్రంలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. సుమారు 3 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అయితే ఓటు వేసే ప్రతి ఒక్కరికీ తమ పోలింగ్ స్టేషన్ గురించిన సమాచారం తెలుసుకుని ఉండటం చాలా ముఖ్యం. చాలా మంది ఓటర్లు లాస్ట్ మినిట్లో లిస్టులో తమ పేరు లేదని ఫిర్యాదు చేయటం, ఆ కేంద్రంలో అసలు వారి పేరే లేదని పోలింగ్ అధికారులు చెప్పటం వంటివి చూస్తూనే ఉన్నాం. ఆఖరి నిమిషంలో ఇలా హడావుడి పడకుండా ఉండాలంటే ఓటర్లు ముందే తమ పోలింగ్ స్టేషన్ గురించి ఖచ్చితంగా తెలుసుకుని వెళ్లటం ఉపయోగకరంగా ఉంటుంది. కేవలం ఇంటి వద్ద నుంచే ఆన్లైన్లో పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చు. అది ఎలాగంటే..
సోషల్ మీడియా వేదికగా రాజకీయ సమరం - విమర్శలు, ప్రతివిమర్శలతో హోరెత్తుతున్న ప్రచారం
మూడు పద్ధతుల ద్వారా పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవచ్చు.
1. Search by Details:
- ముందుగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చెయ్యాలి. (ఇక్కడ క్లిక్ చేయండి).
- పేజీ కుడివైపున Services కాలమ్లో Search in Electoral Roll పై క్లిక్ చేయాలి.
- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో మొదటగా Search by Details ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- అందులో రాష్ట్రం, పేరు, తండ్రి/భర్త పేరు, పుట్టిన తేదీ/వయసు, జెండర్, జిల్లా పేరు, అసెంబ్లీ నియోజకవర్గం వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి Search ఆప్షన్పై క్లిక్ చేస్తే.. మీ పూర్తి వివరాలు, పోలింగ్ స్టేషన్ వివరాలు స్క్రీన్ మీద కనిపిస్తాయి..
అసెంబ్లీ సమరానికి తెలంగాణ సై - పోలింగ్ ఏర్పాట్లలో బిజీబిజీగా ఈసీ