తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ చలిలో మటన్ పాయా.. సూప్ జుర్రేస్తే జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!

How to Make Mutton Paya Soup : చలి గజగజా వణికిస్తోంది. ఇలాంటి టైమ్​లో ఏది తిన్నా వేడి వేడిగా ఉండాల్సిందే. అయితే.. హాట్ హాట్​గా సూప్ గొంతు జారుతుంటే ఎలా ఉంటుంది? అది ఫేమస్ మటన్ పాయా సూప్ అయితే ఇంకెలా ఉంటుంది? జింగదీ ఖుష్ అనాల్సిందే. ఇమ్యూనిటీ బూస్టర్​ కూడా అయిన ఈ సూపర్ సూప్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Mutton Paya Soup
How to Make Mutton Paya Soup

By ETV Bharat Telangana Team

Published : Dec 24, 2023, 8:20 AM IST

How to Make Mutton Paya Soup : మటన్ పాయా సూప్.. నాన్ వెజ్ ప్రియుల్లో ఇది వెరీ ఫేమస్ రెసిపీ. హైదరాబాదీ దమ్ బిర్యానీ ఎంత ఫేమసో.. మటన్ పాయా కూడా అంతే. ఇది టేస్ట్ పర్పస్ మాత్రమే కాదు.. హెల్దీ కూడా! ఇందులో నేచరల్ కొల్లాజెన్‌ ఉంటుంది. ఇది కడుపులో పేగుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని పెంచడంలో మటన్ పాయా అద్భుతంగా పనిచేస్తుందట. చలికాలంలో అందరినీ అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు.. దగ్గు, జలుబుతో బాధపడుతుంటారు.

ఈ బాధల నుంచి రిలీఫ్ కోసం.. ఘాటు ఘాటుగా పాయా సూప్ తీసుకుంటే చక్కటి రిలీఫ్ వస్తుందంటే నమ్మాల్సిందే. ఇది సూపర్ టేస్ట్​తోపాటు బెస్ట్​ హోం రెమెడీగా పనిచేస్తుందని చెప్పొచ్చు. అంతేకాదు.. మటన్ పాయా సూప్ శరీరానికి చాలా బలవర్థకమైనది. ఎముకల బలానికి ఇది చాలా బూస్టింగ్ ఇస్తుందని.. రోగనిరోధక శక్తిని చాలా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాదు.. ఏదైనా తిన్నది సరిగా అరగకపోతే కూడా.. మటన్ పాయా సూప్ తీసుకుంటే.. వెంటనే సెట్ అయిపోతుందని చెప్తున్నారు.

ఇలాంటి సూపర్ ఫుడ్​ను ఈ సండే మీరు ట్రై చేయాల్సిందే! అయితే.. చాలా మందికి ఈ సూప్ తయారీ గురించి పెద్దగా తెలియదు. అదొక లాంగ్ ప్రాసెస్ అనీ.. చాలా కష్టమైన పని అనుకుంటారు. కానీ.. చాలా సింపుల్​గా దీన్ని తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో మనం చూసేద్దాం. ఇంట్లోనే చేసేద్దాం.

మటన్ పాయా సూప్ తయారీ పదార్థాలు :

మేక కాళ్లు 5-6

వాటర్ - హాఫ్ లీటర్ పైన

ఉల్లిపాయ ముక్కలు - కప్పు

సన్నగా కట్​ చేసుకున్న వెల్లుల్లి - 1 స్పూన్

కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరి నూనె - 1 స్పూన్

లవంగాలు - 2

అల్లం - 1 అంగుళం

యాలకులు - 2

దాల్చిన చెక్క - మీడియం ముక్క

బిరియానీ ఆకులు - 2

జాపత్రి - 1

మిరియాల పొడి - తగినంత

కొత్తిమీర - తగినంత

ఉప్పు - తగినంత

మటన్ పాయా సూప్ తయారీ విధానం ఇలా..

ప్రెజర్ కుక్కర్‌ స్టౌమీద పెట్టి.. అందులో నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మసాలా దినుసులు అందులో వేసి వేయించండి. వేగిన తర్వాత.. తరిగిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు వేయాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత.. శుభ్రం చేసుకున్న మేక కాళ్లను అందులో వేయాలి. ఇప్పుడు లో ఫ్లేమ్​లో వాటిని వేయించాలి.

అనంతరం మిరియాలు, ఉప్పు వేసి.. నీళ్లు కూడా పోసి బాగా కలపాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 7-8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఆ తర్వాత స్టౌ ఆఫ్​ చేసి సూప్​ను వడపోయాలి. అంతే.. అద్భుతమైన పాయా సూప్ రెడీ. దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని.. చక్కగా నిమ్మరసం పిండి స్పూన్​తో సిప్​ చేస్తూ ఉంటే.. "ఆహా" అనకపోతే అడగండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సండే ఇలా కానిచ్చేయండి!

ABOUT THE AUTHOR

...view details