పదకొండేళ్లుగా బాలపూర్ వినాయకునికి లడ్డు ప్రసాదం తయారు చేయడం తమకెంతో ఆనందంగా ఉందని తాపేశ్వరం హనీఫుడ్స్ నిర్వాహకులు అంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టినా తమకు ఇలాంటి అవకాశం, అదృష్టం దొరకదన్నారు. ఎంతో నిష్ఠగా, మాల ధరించి కుటుంబ సభ్యులంతా కలిసి... సుగంద ద్రవ్యాలతో బాలపూర్ గణనాథునికి 21 కేజీల లడ్డు తయారు చేస్తున్నామంటున్న ఉమామహేశ్వర్రావుతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఏళ్ల చరిత్ర ఉన్న తాపేశ్వరం లడ్డు - ganesh
నిత్యం ఎన్నోరకాల స్వీట్లు తయారు చేస్తున్నా గణనాధుడి లడ్డు వారికెంతో ప్రత్యేకమైనదని... అది తమ అదష్టంగా భావిస్తున్నారు లడ్డు తయారీదారులు ఉమామహేశ్వరరావు. తమ కుటుంబానికి లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నారు తాపేశ్వరం హనీఫుడ్స్ నిర్వాహకులు.
ఏళ్ల చరిత్ర ఉన్న లడ్డు... అదృష్టంగా భావిస్తున్న తయారీదారు