తెలంగాణ

telangana

ETV Bharat / state

మీకు "ఓటర్​ స్లిప్​" ఇంకా అందలేదా? ఇలా సింపుల్​గా అందుకోండి! - ఓటర్​ స్లిప్​ ఎలా పొందాలి

How to Download Voter Slip in Online: తెలంగాణలో మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్​ మొదలుకానుంది. అయితే.. కొద్దిమందికి ఓటరు స్లిప్స్ అందకపోవచ్చు. అలాంటి వారు ఎవరైనా ఉంటే.. ఈ పద్ధతులు ఫాలో అవ్వడం ద్వారా.. మీ ఓటర్​ స్లిప్​ను డౌన్​లోడ్​ చేసుకోవచ్చు!

how to download voter slip For Telangana Elections
how to download voter slip

By ETV Bharat Telangana Team

Published : Nov 29, 2023, 2:58 PM IST

How to Download Voter Slip in Online for Assembly Elections 2023: తెలంగాణలో ఓట్ల పండగ మరికొన్ని గంటల్లో ప్రారంభంకానుంది. నవంబర్ 30న జరిగే పోలింగ్​ కోసం.. ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఓటర్​ స్లిప్​లు అందించే ప్రక్రియ పూర్తయింది. అయితే.. కొద్దిమందికి ఓటరు స్లిప్​ అందకపోవచ్చు. అలాంటి వారు టెన్షన్​ పడకుండా ఈ పద్ధతులను ఫాలో అయ్యి మీ ఓటర్​ స్లిప్​ను పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

సామాన్యుడి చేతిలో ఓటే ఆయుధం - ఆ హక్కును వినియోగించే సమయం ఆసన్నమైంది

ఓటర్ స్లిప్ వల్ల ఏంటి లాభం?: మన దగ్గర ఓటర్ ఐడీ ఉంటుంది కదా.. మరి, ఈ స్లిప్ ఎందుకు? అనే డౌట్ రావొచ్చు. ఎందుకంటే.. మనం ఉన్న ఏరియాలో దాదాపు నాలుగైదు పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. వాటిలో ఒక కేంద్రంలో మాత్రమే మనం ఓటు వేసేందుకు వీలు ఉంటుంది. ఆ పోలింగ్ బూత్ ఏది? ఎక్కడుంది? అనేది మనకు తెలియాలంటే.. ఓటర్ స్లిప్ మన దగ్గర ఉండాలి. మనం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు.. ఓటర్ ఐడీ కార్డు లేదా.. ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డుతోపాటూ.. ఈ స్లిప్ తీసుకెళ్తే.. త్వరగా ఓటు వేసేయగలం.

'మా వద్ద బోలెడు ఓట్లున్నాయ్ - మీ రేటెంతో చెబితే ఓ మాటనేసుకుందాం'

అయితే.. గతంలో ఉన్న ఓటర్​ స్లిప్​లకు.. ప్రస్తుతం అందించిన స్లిప్​లకు తేడా ఉంది. గతంలో పోల్ చీటీలను పార్టీల వారే పంపిణీ చేసేవారు. అయితే.. ప్రచారం ముగిసిన తర్వాత పోల్ చీటీల పంపిణీ పేరుతో.. గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని గమనించిన ఎన్నికల సంఘం దానిని నివారించింది. 2018 నాటి ఎన్నికల నుంచి అధికారికంగానే వీటిని పంపిణీ చేస్తున్నారు. గతంలో పోల్ చీటీలో కేవలం ఓటరు ఫొటో, వివరాలు మాత్రమే ఉండేవి. ఈసారి ఎన్నికల్లో నూతన విధానంలో ఓటర్ స్లిప్పులను రూపొందించారు. పోలింగ్ తేదీ, పోలింగ్ ప్రారంభం, ముగింపు సమయం, పేరు, ఓటరు గుర్తింపు కార్డు నంబరు, గ్రామం, పోలింగ్ కేంద్రం, టోల్ ఫ్రీ నంబర్ ముద్రించారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు బూత్ స్థాయి అధికారి పేరు, మొబైల్ నంబరు కూడా ప్రింట్ చేశారు. ఓటరు తెలుసుకోవాల్సిన నిబంధనలను సైతం పొందుపరిచారు.

ఓటు ఒక వజ్రాయుధం - మరి ఓటేస్తానికి మీరు సిద్ధమా

ఓటరు స్లిప్​ అందకపోతే ఇలా చేయండి: ఓటర్ స్లిప్పులు ఎన్నికల సిబ్బంది నుంచి అందకపోతే.. ఆన్‌లైన్ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా, మొబైల్ ఎస్ఎంఎస్ ద్వారా పొందడానికి ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఒకవేళ ఫిజికల్ లేదా డిజిటల్ ఓటర్ స్లిప్ లేకపోయినా నేరుగా పోలింగ్ బూత్‌కు వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

  • ఎస్‌ఎంఎస్‌ ద్వారా:ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ టైప్ చేసి 1950 లేదా 9211728082 అనే నెంబర్‌కు SMS పంపితే వివరాలు వస్తాయి.
  • టోల్‌ ఫ్రీ నెంబరు:24 గంటల పాటు పనిచేసే టోల్‌ఫ్రీ నంబరు 1950కు ఫోన్‌ చేసి ఓటరు గుర్తింపు కార్డు నంబరు సాయంతో పోలింగ్‌ కేంద్రం, బూత్‌ నంబరు, క్రమ సంఖ్య వంటి వివరాలు తెలుసుకోవచ్చు.
  • ఆన్‌లైన్‌లో:https://www.ceotelangana.nic.in/ అనే వెబ్‌సైట్‌లో Search Your Name in Voter List ఆప్షన్​పై క్లిక్​ చేసి.. ఓటరు గుర్తింపు కార్డు లేదా మొబైల్ నెంబర్ లేదా పేరును ఇవ్వడం ద్వారా ఏ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేయవచ్చో తెలుసుకోవడంతో పాటు డిజిటల్ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.
  • మెయిల్ ద్వారా..:ఎన్నికల సంఘానికి మెయిల్ (complaints@eci.gov.in) చేసి కూడా.. పోలింగ్ బూత్ వివరాలను పొందవచ్చు.
  • మొబైల్ యాప్‌తో:ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి, ఐఓఎస్ వినియోగదారులు యాప్ స్టోర్ నుంచి 'ఓటర్ హెల్ప్ లైన్ యాప్' అనే అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వివరాలను ఇవ్వడం ద్వారా.. ఏ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయవచ్చో తెలుసుకోవచ్చు.

ఎన్నిక ప్రచారం ముగిసింది - ప్రలోభాల పర్వం ప్రారంభమైంది

'ఇందా ఈ డబ్బు తీసుకో - నాకే ఓటేస్తానని దేవుడి మీద ఒట్టేయ్'

రావి ఆకుపై వినూత్న సందేశం-ఓటరు మహాశయా ఆలోచించి ఓటు వేయవయ్యా!

ABOUT THE AUTHOR

...view details