How to Check Rythu Bandhu Payment Status in Telugu : రైతులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు తెలంగాణ సర్కార్ రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 మే 10న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో శాలపల్లి వద్ద ప్రారంభించారు. 'రైతు బంధు' పథకం(Rythu Bandhu Scheme) ద్వారా ఎకరానికి ఖరీఫ్‌లో రూ. 5వేలు, రబీలో 5వేల రూపాయల చొప్పున.. సంవత్సరానికి 10వేల రూపాయలు రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం జమ చేస్తోంది. విత్తనాలు, పురుగులమందుల వంటి పెట్టుబడుల కోసం ఆర్థిక సాయాన్ని అందిస్తూ.. అన్నదాతలను ఆదుకుంటోంది.
Rythu Bandhu Funds 2023 Details :ఈ క్రమంలో ఇటీవల 2023 సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ మొత్తం 11విడతల్లో రైతు బంధు ద్వారా అన్నదాతలు రూ.72,910 కోట్ల ఆర్థిక సాయాన్ని తెలంగాణ సర్కార్(Telangana Government) అందించింది. అయితే.. ఈ దఫా కొత్తగా ఐదు లక్షల మంది అన్నదాతలకు ఈ స్కీమ్‌ను వర్తింపజేసింది. రాష్ట్రంలో సుమారు 70లక్షల మందికి వానాకాలం సీజన్‌కుగానూ ఇటీవల విడుదల చేసిన రైతుబంధు డబ్బులు జమకానున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నగదు అర్హులైన ఆయా రైతుల అకౌంట్లలో దశల వారీగా డిపాజిట్ అవుతున్నాయి.
మొదటగా మీరు.. ఇటీవల విడుదల చేసిన రైతుబంధు జాబితాలో ఉన్నారో లేదో ఇలా తెలుసుకొని.. ఆపై మీ రైతుబంధు పేమెంట్ స్టేటస్ సింపుల్‌గా ఆన్లైన్లో ఇలా తెలుసుకోండి.
- మొదట మీరు Rythubandhu.telangana.gov.in అనే అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- అనంతరం హోం పేజీలో ఉన్న 'Rythu Bandhu Scheme' అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.
- అప్పుడు మీకు కొత్తగా ఓపెన్ అయ్యే వెబ్ పేజీలో 'Cheque Distribution Schedule Report' మీద క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత వచ్చే పేజీలో మీ జిల్లా, మండలం ఎంపిక చేసుకోవాలి.
- అనంతరం మీకు స్క్రీన్‌పై లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది.
- ఆ లిస్ట్‌లో మీ పేరు ఉందో లేదో అక్కడ చెక్ చేసుకోవాలి.
- అందులో మీ పేరు ఉంటే మీ రైతుబంధు పేమెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోండి.
రైతు బంధు స్టేటస్‌ను అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఇలా చెక్ చేసుకోండి..
How to Check Rythu Bandhu Status through the Official Website in Telugu :
- మొదట మీరు తెలంగాణ ట్రెజరీ అధికారిక వెబ్ సైట్ rythubandhu.telangana.gov.in ను సందర్శించాలి.
- అప్పుడు అక్కడ ఓపెన్ అయిన పేజీలో 'Rythu Bandhu Agriculture Investment Support Scheme' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీరు రైతుబంధు అందుకునే సంవత్సరాన్ని నమోదు చేసి.. పీపీబీ నెంబర్ సెలక్ట్ చేసుకుని సబ్మిట్ చేయాలి.
- ఆపై మీ జిల్లా, మండలాన్ని ఎంచుకోవాలి. అలాగే అక్కడ అడిగిన వివరాలు సబ్మిట్ చేయాలి.
- కొంత సమయం తర్వాత చెక్ డిస్ట్రిబ్యూషన్ షెడ్యూల్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఇప్పుడు మీరు దాన్ని తనిఖీ చేసి సేవ్ చేసుకోవాలి. ఇలా మీ రైతుబంధు పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.