ఆరో విడత హరితహారంలో భాగంగా 29.86 కోట్ల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ చివరగా 11.78 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ దఫా లక్ష్యమైన 29.86 కోట్ల మొక్కల్లో ఇప్పటివరకు 39.46 శాతం పూర్తయ్యాయని తెలిపింది. నిర్దేశించిన లక్ష్యంలో 96.52 శాతంతో మొక్కలు నాటి కామారెడ్డి జిల్లా మొదటిస్థానంలో నిలించిందని పేర్కొంది. కొత్తగూడెం, వరంగల్ రూరల్ జిల్లాలు 70 శాతానికి పైగా మొక్కలు నాటాయని పేర్కొంది.
ఆరో విడతలో ఎన్ని కోట్ల మొక్కలు నాటారో తెలుసా? - ఆరో విడత హరితహారంలో 11.78 కోట్ల మొక్కలు నాటారు
రాష్ట్రంలో ఆరో విడత హరితహారంలో భాగంగా 11.78 కోట్ల మొక్కలు నాటినట్లు ప్రభుత్వం వివరాలు ప్రకటించింది. కామారెడ్డి జిల్లా మొదటిస్థానంలో ఉండగా, జీహెచ్ఎంసీ చివరిస్థానంలో ఉన్నట్లు తెలిపింది.
రాష్ట్రంలో ఆరో విడతలో ఎన్ని కోట్ల మొక్కలు నాటారో తెలుసా
మేడ్చల్, మహబూబ్‌నగర్, ఆసిఫాబాద్ జిల్లాలు లక్ష్యంలో 60 శాతానికి పైగా, నిర్దేశించిన లక్ష్యంలో కేవలం 5.25 శాతంతో జీహెచ్ఎంసీ చివరిస్థానంలో నిలించిందని ప్రభుత్వం వివరించింది. నిర్దేశించిన లక్ష్యంలో హెచ్ఎండీఏ 12.61శాతం, వరంగల్ అర్బన్ 24.82 శాతంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చూడండి :ప్రభుత్వం నిద్రపోతోంది, ప్రజలను గాలికి వదిలేసింది: హైకోర్టు