తెలంగాణ

telangana

By

Published : Mar 15, 2021, 4:20 AM IST

ETV Bharat / state

'పట్టణప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి'

రాష్ట్రంలో అమృత్, స్మార్ట్ సిటీ పనులతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలని పట్టణాభివృద్ధి పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. ఛైర్మన్ జగదాంబికాపాల్ నేతృత్వంలోని స్థాయీసంఘం సమావేశం ఆదివారం హైదరాబాద్​లో జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు, ఎస్బీఐ ప్రతినిధులు పాల్గొన్నారు.

Housing construction should be accelerated in urban areas by  urban development standing committee
'పట్టణప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి'

రాష్ట్రంలో అమృత్, స్మార్ట్ సిటీ పనులతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలని పట్టణాభివృద్ధి పార్లమెంటరీ స్థాయీ సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో పురపాలకశాఖ తరఫున చేపట్టిన వివిధ కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న నిధులు, వినియోగం, తదితర అంశాలపై ఛైర్మన్ జగదాంబికాపాల్ హైదరాబాద్​లో సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు బండి సంజయ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి, వైఎస్ చౌదరి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, సంచాలకులు సత్యనారాయణ, ఎస్బీఐ ప్రతినిధులు, ఇతరులు సమావేశంలో పాల్గొన్నారు.

పీఎం స్వానిధిలో భాగంగా వీధివ్యాపారులకు రుణాలు ఇచ్చే విషయంలో ముందంజలో ఉన్న తెలంగాణను పార్లమెంటరీ స్థాయీ సంఘం అభినందించింది. స్వయం సహాయక మహిళా సంఘాలకు రుణాల విషయంలోనూ బాగానే ఉందని అధికారులను అభినందించారు. అయితే 2022 నాటికి అందరికీ ఇళ్లు ఉండాలన్న లక్ష్యం మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నప్పటికీ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడం లేదని కమిటీ ప్రశ్నించినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అందుతున్నప్పటికీ రెండు పడకల గదుల ఇళ్ల పథకంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోటో ఎందుకు ఉపయోగించడం లేదని భాజపా ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మ్యాచింగ్ గ్రాంటు విడుదల చేయలేదని.. కరీంనగర్ ఎంపీ నేతృత్వంలో స్మార్ట్ సిటీ అడ్వైజరీ కౌన్సిల్ ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వీధివ్యాపారులను ఎందుకు తొలగిస్తున్నారని.. టౌన్ వెండింగ్ కమిటీలు ఎందుకు ఏర్పాటు చేయలేదని కమిటీ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఇదీ చూడండి:నేటి నుంచే రాష్ట్ర వార్షిక బడ్జెట్​ సమావేశాలు

ABOUT THE AUTHOR

...view details