Houses Demolition in Guntur: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పనులు ఉద్రిక్తతకు దారితీశాయి. ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణకు 120 అడుగులు మార్కింగ్ వేశారు. దీని ప్రకారం రోడ్డుకు ఇరువైపుల జేసీబీ సహాయంతో ఇళ్ల కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతపై గ్రామస్థులు మండిపడ్డారు. గ్రామానికి బస్సు సౌకర్యమే లేదని అలాంటప్పుడు రహదారులు ఎలా అభివృద్ధి చేస్తారని ప్రజలు ప్రశ్నించారు.
జనసేన సభకు భూములిచ్చారని ఇళ్లు కూల్చేశారు..!
Houses Demolition in Guntur: ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. రహదారి విస్తరణ కోసం ఇరువైపులా ఉన్న ఇళ్లను కూలుస్తున్నామని అధికారులు చెబుతున్నా.. జనసేన సభకు తమ భూములు ఇచ్చినామన్న కోపంతోనే బస్సే రాని ఊరిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టారని గ్రామస్థులు వాపోయారు.
Houses Demolition in Guntur
జనసేన ఆవిర్భావ సభకు తమ భూములు ఇచ్చామన్న అక్కసుతోనే ప్రభుత్వం ఈ దారుణానికి ఒడిగట్టిందని ఆరోపించారు. ఆక్రమణలను అడ్డుకున్న గ్రామస్థులను పోలీసులు బలవంతంగా అదుపులో తీసుకున్నారు. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులను మోహరించారు. పోలీసుల సహాయంతో నగరపాలక సిబ్బంది కూల్చివేతలను కొనసాగించారు.
ఇవీ చదవండి:
- 'ఎమ్మెల్యేల ఎర' కేసు విచారణ సోమవారానికి వాయిదా
- ఇళ్ల మధ్యలోకి వచ్చి బీభత్సం సృష్టించిన చిరుత
- మాజీ బాయ్‌ఫ్రెండ్ నుంచి మెసేజ్.. తెగ సంతోషడిపోయిన జాన్వీ!