హైదరాబాద్‌లో గృహాల అమ్మకాలు తగ్గిపోతున్నాయి. గత ఏడాది జులైలో 9507 ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది జూలైలో 55 శాతం తగ్గి కేవలం 4313 ఇళ్లు మాత్రమే విక్రయాలు జరిగాయి. అలాగే గత ఏడాది జులైలో రూ.4572 కోట్లు విలువ చేసే ఇళ్లు అమ్ముడుపోగా.. ఈ ఏడాది జులైలో 54 శాతం తగ్గి రూ.2100 కోట్లు విలువ చేసే ఇళ్ల అమ్మకాలు జరిగాయి. ఈ ఏడాది జనవరి నుంచి చూసుకుంటే.. ప్రతి నెల అంతకుముందు ఏడాదిలో జరిగిన రిజిస్ట్రేషన్ల కంటే తక్కువగా జరిగినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జూలైలో విక్రయాలు జరిగిన ఇళ్లలో రూ.25లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య విలువ చేసే ఇళ్లు అత్యధికంగా 56 శాతం, వెయ్యి నుంచి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన గృహాలు అత్యధికంగా 72 శాతం అమ్ముడుపోయినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. రూ.50 లక్షలు లోపు విలువ చేసే ఇళ్ళు అంతకు ముందు ఏడాది 34 శాతం ఉండగా.. ఈ సంవత్సరం 56 శాతానికి ఎగబాకాయి. విస్తీర్ణం విషయంలో ఎలాంటి మార్పు కనబర్చలేదు.