బడ్జెట్ ప్రతిపాదనలు వారం రోజుల్లోగా అందించాలని పోలీసు అధికారులను హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. రాష్ట్ర పూర్తి స్థాయి బడ్జెట్ త్వరలో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ భేటీకి హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి సహా ఇతర సీనియర్ అధికారులు, శాఖాధిపతులు హాజరయ్యారు. ఆయా విభాగాల వారీగా వ్యయాలు, పెండింగ్ బిల్లులను మహమూద్ అలీ అడిగి తెలుసుకున్నారు.
హోంశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై మహమూద్ అలీ సమీక్ష - muhammad ali
బడ్జెట్ ప్రతిపాదనలు వారం రోజుల్లోగా అందించాలని పోలీసు అధికారులను హోంమంత్రి మహమూద్ అలీ ఆదేశించారు. హోంశాఖ ముఖ్యకార్యదర్శి రాజీవ్ త్రివేది, డీజీపీ మహేందర్ రెడ్డి, సహా పలువురు అధికారులు సమీక్షలో పాల్గొన్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలు తెలపండ :హోంమంత్రి