తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఇళ్లకే పరిమితం కండి.. కరోనాను తరిమికొట్టండి' - కరోనాపై మంత్రి మహమూద్​ అలీ నివారణ చర్యలు

పోలీస్​ అధికారులతో మంత్రి మహమూద్​ అలీ సమావేశమయ్యారు. ఉగాది పండుగకు కూడా ఒకే చోట కలిసి ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా ఇంట్లోనే ఉండి తమను తాము కాపాడుకోవాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు.

ఉగాదికి కూడా గుంపులుగా ఉండొద్దు: హోం మంత్రి
ఉగాదికి కూడా గుంపులుగా ఉండొద్దు: హోం మంత్రి

By

Published : Mar 23, 2020, 10:17 PM IST

ఉగాది పండుగకు కూడా ఒకే చోట గుంపులుగా గుమిగూడొద్దని హోంమంత్రి మహమూద్​ అలీ విజ్ఞప్తి చేశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో పోలీస్​ అధికారులతో మంత్రి సమావేశమయ్యారు. వైరస్ వ్యాప్తి దృష్ట్యా శాంతిభద్రతల పరంగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీసులతో సమాలోచనలు చేశారు.

ప్రజలంతా ఇంట్లోనే ఉండి తమను తాము రక్షించుకోవాలని మంత్రి సూచించారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావొద్దని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచి.. వారికి కౌన్సిలింగ్​ ఇస్తూ తిరిగి వెనక్కి పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అధిక ధరలకు కూరగాయలు అమ్మితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకు రావాలన్నారు. ఫంక్షన్​ హాల్లో చేసే వివాహ వేడుకలకు ఎక్కువమంది రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

ఉగాదికి కూడా గుంపులుగా ఉండొద్దు: హోం మంత్రి

అనంతంర హైదరాబాద్ పాతబస్తీలోని ఛార్మినార్ పరిసరాలను మహమూద్​ అలీ పరిశీలించారు. పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారన్నారు. ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకున్న వెంటనే ఇళ్లకు పరిమితమవ్వాలని కోరారు. పాతబస్తీ యువత రోడ్లపైకి వస్తున్నారని.. ఇలా ప్రవర్తించొద్దని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడిండి:ప్రభుత్వం ప్రకటించిన లాక్​డౌన్​ మార్గదర్శకాలివే...

ABOUT THE AUTHOR

...view details