తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2022, 10:53 PM IST

ETV Bharat / state

రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనుకునే వారిని సహించమన్న హోంమంత్రి

Home Minister on Raja Singh comments శాంతి భద్రతల విషయంలో ప్రభుత్వం రాజీపడదని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాజా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన ఆయన చట్టం ముందు అందరూ ఒక్కటేనని వెల్లడించారు. ప్రజలు వారి వారి మతాలకు, కులాలకు, ఆచారాలకు, సంస్కృతి-సంప్రదాయాలకు అనుగుణంగా జీవించే హక్కు ఉందని స్పష్టం చేశారు. చట్టానికి ఎవ్వరూ అతీతులు కాదని ప్రజలందరూ సంయమనంతో, సోదరభావంతో ఉండాలని పిలుపునిచ్చారు

రాష్ట్రంలో అశాంతి సృష్టించాలనుకునే వారిని సహించమన్న హోంమంత్రి
Home Minister's response to Raja Singh

Home Minister on rajasingh comments రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలపై హోం మంత్రి మహమూద్ అలీ స్పందిచారు. శాంతి భద్రతల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంభిస్తోందని... ఇతర మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడి తద్వారా అశాంతిని సృష్టించాలనుకునే వారిని తెలంగాణ ప్రభుత్వం సహించదని తెలిపారు. ఎమ్మెల్యే రాజా సింగ్‌పై హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు వచ్చాయన్నా ఆయన... చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. చట్టానికి జాతి, మత, కుల, వర్గ ఇతర భేదాలు ఉండవని... చట్టానికి ఎవ్వరూ అతీతులు కారని స్పష్టం చేశారు.

ప్రజలు వారి వారి మతాలకు, కులాలకు, ఆచారాలకు, సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జీవించే హక్కు ఉందని పేర్కొన్నారు. మతాలకు వ్యతిరేకంగా ఎలాంటి అవాస్తవాలను, తక్కువ చేసి మాట్లాడడం వంటివి చేస్తే సహించమని తెలిపారు. ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రజలు అందరూ సంయమనంతో, సోదరభావంతో ఉండాలని కోరారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details