హైదరాబాద్ జూబ్లీహిల్స్లో జరిగిన సామూహిక అత్యాచార ఘటనపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఈ సంఘటన జరగడం బాధాకరం అన్నారు. నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ కేసులో బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు తీసుకుంటారన్నారు. తెలంగాణ పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని... స్వతంత్రంగా దర్యాప్తు జరుగుతోందన్నారు. హైదరాబాద్ హజ్ హౌస్లో జరిగిన హజ్ యాత్రికుల వాక్సినేషన్ కార్యక్రమంలో హోమ్ మంత్రి మహమూద్ అలీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు: హోం మంత్రి మహమూద్ అలీ - ts news
హైదరాబాద్ జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచార ఘటనలో నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ స్పష్టం చేశారు. పోలీసులపై ఎలాంటి ఒత్తిడి లేదని స్వతంత్రంగా దర్యాప్తు జరుగుతోందన్నారు.
నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవు: హోం మంత్రి మహమూద్ అలీ
"జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో ఎవరినీ వదలం. నిందితులు ఎవరైనా చర్యలు తప్పవు. మా కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు." -మహమూద్ అలీ, హోంమంత్రి
ఇవీ చదవండి: