కరోనా వైరస్‌తో కొన్ని రోజులుగా చికిత్స పొందుతోన్న హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు. మంత్రితో పాటు ఆయన కుమారుడు, మనవడు కూడా డిశ్చార్జి అయ్యారు. తన ఆరోగ్యం పట్ల వాకబు, ప్రార్థనలు చేసిన వారందరికీ... మహమూద్ అలీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, పార్లమెంటు సభ్యులు సంతోశ్‌కుమార్, కేకే, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ధన్యవాదాలు తెలియజేశారు.
కరోనా నుంచి కోలుకుని ఇంటికెళ్లిన హోంమంత్రి
కరోనా వైరస్ బారిన పడిన హోంమంత్రి మహమూద్ అలీ.. శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జయ్యారు. మంత్రితో పాటు ఆయన కుమారుడు, మనవడు కూడా కోలుకుని ఇంటికెళ్లారు. తన కోసం ప్రార్థనలు చేసిన వారందరికీ హోంమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా నుంచి కోలుకుని ఇంటికెళ్లిన హోంమంత్రి
ఫోన్ ద్వారా పరామర్శించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్ తమిళిసై కి, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, ఇతర పార్టీల నాయకులు, ప్రజలకు, తనకు చికిత్స అందించిన అపోలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. కరోనా వ్యాధి పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హోంమంత్రి సూచించారు. లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందాలని జాగ్రత్తగా ఉండాలని, భయపడవద్దని సూచించారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం... 20వేలు దాటిన కేసుల సంఖ్య