తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిపల్లి పోలీస్​స్టేషన్​ను ప్రారంభించిన హోంమంత్రి

తెలంగాణ పోలీసు వ్యవస్థ దేశానికే ఆదర్శం అని హోమంత్రి మహమూద్ అలీ కొనియాడారు. హైదరాబాద్​లోని పలు ఠాణాల్లో నూతన విభాగాలను ప్రారంభించారు.

By

Published : Jul 1, 2019, 6:55 PM IST

రాష్ట్రంలో నేర శాతం తగ్గింది : మహమూద్ అలీ

రాచకొండ పోలీస్ కమిషనరేట్​ పరిధిలో మేడిపల్లి పోలీస్​స్టేషన్​ను ప్రారంభించారు హోంమంత్రి మహమూద్​అలీ. అన్ని అధునాతన సదుపాయాలు కలిగిన ఠాణా అని పేర్కొన్నారు. అనంతరం సరూర్​నగర్​లో నూతనంగా నిర్మించిన ఎల్బీనగర్ సీసీఎస్, ఐటీ సెల్, ఎస్​ఓటీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంబర్​పేట్​లోని మోటార్ ట్రాన్స్​పోర్టు కార్యాలయాన్ని ప్రారంభించిన ఆయన రాష్ట్రంలో నేర శాతం తగ్గిందన్నారు.
పోలీసులకు సీఎం పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. కాగజ్ నగర్ ఘటనలో అటవీ అధికారులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిర్లక్ష్యం వహించిన పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. అటవీ అధికారులు, అన్యాక్రాంతమైన అడవులను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లినా, హరితహారంలో మొక్కలు నాటేందుకు వెళ్లినా పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.

పలు ఠాణాల్లో నూతన విభాగాలను ప్రారంభించిన హోం మంత్రి

ABOUT THE AUTHOR

...view details