Home Interior decoration: డిజైన్స్‌తో.. గదుల్లోని కార్పెట్లు, సోఫా కవరు, డైనింగ్ టేబుల్, కుర్చీల కవర్లు అన్నీ ఒకే రకమైన వర్ణం, డిజైన్లను మ్యాచింగ్‌గా వేస్తుంటాం. అయితే ఈసారి కొంచెం మార్చి చూడండి. సోఫా కవర్‌కు భిన్నంగా కుషన్స్ కొన్నింటికి స్ట్రైప్స్, మరికొన్నింటికి పూల డిజైన్ల కవర్లను ఎంపిక చేయాలి. అలాగే డైనింగ్ టేబుల్‌పై వేసే క్లాత్ డిజైన్‌కు భిన్నంగా కుర్చీల కవర్లపై పూల ప్రింటు ఉంటే మంచిది. వీటన్నింటితో సంబంధం లేకుండా కార్పెట్ డిజైన్ ఉండేలా మార్చి చూడండి. గోడలకు పూల ప్రింట్లున్న ఫ్రేమ్స్, వీటి వర్ణానికి భిన్నంగా ఉండేలా లేతవర్ణం పూలనుంచిన ఫ్లవర్‌వాజ్ టీపాయిపై సర్దితే చాలు. గదికి కొత్త అందం వచ్చినట్లే.
చిన్నచిన్నగా.. హాల్ లేదా ముందుగదిని చిన్నచిన్న వస్తువులతోనే కొత్తగా మార్చడానికి ప్రయత్నించొచ్చు. ముందుగా గోడకంతా ఒకే ఫ్రేం లేదా పెద్ద గడియారం వంటివి ఉంటే తాత్కాలికంగా వాటి స్థానంలో చిన్నచిన్న నలుపు, తెలుపు ఫొటోలుంచిన నాలుగైదు ఫ్రేంలను వరసగా సర్దాలి. మిగతా గోడను ఖాళీగా వదిలేయాలి. పుస్తకాల అలమరపై చిన్నచిన్న లేతవర్ణం పూల గుత్తులుంచిన ఫ్లవర్‌వాజ్ సర్దాలి.
సోఫా ఎదుట టీపాయిపై చిన్నపరిమాణంలో తెలుపు వర్ణంలో అయిదారు సెట్‌గా ఉండే పింగాణి లేదా గాజు ఫ్లవర్‌వాజ్‌లను సర్ది తలా ఒకదాంట్లో ఒకే ఒక లేత వర్ణం గులాబీని ఉంచితే చాలు. వీటి పక్కగా చిన్న గ్లోబ్ సర్దాలి. ఇలా చిన్న చిన్న అలంకరణలతోనే గదిని ప్రత్యేకంగా కనిపించేలా చేయొచ్చు.