తెలంగాణ

telangana

ETV Bharat / state

HMDA: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపిన హెచ్​ఎండీఏ - HMDA Latest News

Hmda Serious Action On Encroaching land: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్​మెంట్ అథారిటీ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించిన వారిపై హెచ్ఎండీఏ కొరడా జులిపించింది. తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 361లో ఉన్న అక్రమ నిర్మాణాలను పోలీసుల సహాయంతో అధికారులు కూల్చివేశారు.

HMDA
HMDA

By

Published : Apr 16, 2023, 7:52 PM IST

Hmda Serious Action On Encroaching land: హైదరాబాద్​లోని తెల్లాపూర్ మున్సిపాలిటి పరిధిలోని సర్వే నెంబర్ 361లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై హెచ్​ఎండీఏ ( హైదరాబాద్ మెట్రోపాలిటిన్ డెవలప్​మెంట్ కార్పొరేషన్) కఠిన చర్యలు తీసుకొంది. తెల్లాపూర్​లో భూకబ్జా విషయం మెట్రోపాలిటన్ కమిషనర్ ఆర్వింద్​ కుమార్ దృష్టికి రావడంతో వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

దీంతో హెచ్ఎండీఏ ఎస్టేట్ అధికారులు, ఎన్​ఫోర్స్​ మెంట్ యంత్రాంగం రంగ ప్రవేశం చేసి కూల్చివేత చర్యలు ప్రారంభించారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నెంబర్ 361లో హెచ్ఎండీఏకు సంబంధించిన దాదాపు 350 గజాల స్థలాన్ని ఆక్రమించి.. హోటల్ నిర్మాణం జరిపి వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం హెచ్​ఎండీఏ దృష్టికి రావడంతో అధికార యంత్రాంగం, స్థానిక పోలీసుల సహాయంతో ఆక్రమణలను తొలగించే ఆపరేషన్ చేపట్టింది.

కాళ్ల బేరానికి వచ్చిన కబ్జాదారుడు: కూల్చివేత చర్యలను అడ్డుకునేందుకు కబ్జాదారులు చేసిన ప్రయత్నాలన్నింటికి హెచ్ఎండీఏ చెక్ పెట్టడంతో కబ్జాదారులు కాళ్ల బేరానికి రావాల్సి వచ్చింది. చివరకు తమ ఇనుప సామగ్రి, డెకరేషన్ వస్తు, పరికరాలు తామే స్వయంగా తొలగించుకుని తీసుకుపోతామని సదరు వ్యక్తి చెప్పడంతో దానికి అధికారులు సమ్మతించారు. దీంతో కూల్చివేత ప్రక్రియ కాస్త ఆలస్యంగా జరిగింది.

ఆ తరువాత యజమాని వస్తువులను తీసుకుపోవడంతో ఆక్రమాణలను కూల్చివేశారు. హెచ్ఎండీఏ భూముల జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. ఎవరైనా హెచ్ఎండీఏ భూములను కబ్జా చేసినట్లయితే వారే స్వచ్ఛందంగా వాటిని వదిలి వెళ్లిపోవాలని సూచించారు. లేకుంటే ఆ తరువాత పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.

హెచ్​ఎండీఏ ఇలాంటి కఠిన చర్యలు ఎన్నో చేపడుతన్న కబ్జాదారుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. చిన్న ఖాళీ స్థలం కనిపించిన భూ బకాసురులు అక్కడ రాబందుల్లా వాలిపోయి అక్రమ నిర్మాణాలు చేపట్టేస్తున్నారు. కొందరి నాయకుల అండదండలు చూసి వారు రెచ్చిపోతున్నారు. దీంతో అధికారులు చేసేది లేకా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

వసూళ్లులో ఘనం.. సౌకర్యాల్లో విఫలం..: మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో హెచ్​ఎండీఏ విఫలమైంది. ఏటా 500 కోట్ల వరకు టోల్‌ వసూళ్లు అవుతున్నా.. ప్రయాణికులకు మాత్రం సౌకర్యాలు కల్పించలేకపోతోంది. కనీసం మరుగుదొడ్లతో పాటు ఔటర్ మధ్యలో లేదా ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇవీ చదవండి:

HMDA చర్యలు.. హరితమయం దిశగా రహదారులు

మ్యూజికల్ ఫౌంటెన్ వెలుగులు విరజిమ్మే.. సచివాలయం తలతల మెరిసే!

కర్ణాటక ఎన్నికలు.. BJPకి మాజీ సీఎం రాజీనామా.. కాంగ్రెస్​ 'ఆపరేషన్​ హస్త'.. ఏం జరగనుందో?

మర్మాంగానికి పిన్నీసులు.. నగ్నంగా మృతదేహం.. అదే కారణమా?

ABOUT THE AUTHOR

...view details