తెలంగాణ

telangana

ETV Bharat / state

హిందువులకు రక్షణ కల్పించాలి: వీహెచ్​పీ

రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని వీహెచ్​పీ ప్రతినిధులు డీజీపీ మహేందర్ రెడ్డిని విన్నవించారు.

హిందువులకు రక్షణ కల్పించాలి: వీహెచ్​పీ

By

Published : Nov 1, 2019, 7:55 PM IST

హిందువులకు రక్షణ కల్పించాలి: వీహెచ్​పీ
అయోధ్య శ్రీరామ జన్మభూమి సందర్భంగా రాష్ట్రంలో తగు భద్రతా చర్యలు చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. వీహెచ్​పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత రావు డీజీపీకి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి సమాజంలో అశాంతిని కలిగించాలని కొన్ని శక్తులు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని వారు ఆరోపించారు. ఇస్లామిక్ మతోన్మాద తీవ్రవాద భావజాలంతో ఇటీవల సామాజిక మాధ్యమాల ద్వారా కూడా సమాజంలో గొడవలు సృష్టిండానికి కొన్నిశక్తులు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల హిందువులపై మూకుమ్మడి దాడులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details